ETV Bharat / state

'రాష్ట్ర బడ్జెట్ లెక్కల గారడిలాగా ఉంది - అందమైన పెద్ద పెద్ద పదాలు, అంకెలతో తయారు చేశారు' - bjp Payal Shankar on state budget - BJP PAYAL SHANKAR ON STATE BUDGET

BJP Payal Shankar on State Budget 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల గారడిలాగా ఉందని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. అందమైన పెద్ద పెద్ద పదాలు, అంకెలతో బడ్జెట్ తయారు చేశారని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు బడ్జెట్​లో నిధులు రాలేదని విమర్శలు చేయడం బాధాకరమన్నారు. కేంద్ర బడ్జెట్​లో తెలంగాణ పదం ఉచ్చరించలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఏ జిల్లాల పేర్లను పలికారో చెప్పాలని డిమాండ్ చేశారు.

BJP Payal Shankar slams Congress
BJP Payal Shankar on State Budget 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 5:17 PM IST

BJP Payal Shankar slams Congress : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై శాసనసభలో చర్చను బీజేపీ తరఫున ఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంటోన్మెంట్ అంశంపై కేంద్రాన్ని కోరగానే, వెంటనే రక్షణ శాఖ భూములను అప్పగించడానికి ఒప్పుకుందని ఆయన గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చాలా అంశాలపై సీఎం వద్ద స్వయంగా విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ, తన విజ్ఞప్తులపై రాష్ట్ర బడ్జెట్​లో ఎలాంటి నిధులు కేటాయించలేదని అవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో కేంద్రాన్ని నిందిస్తోంది : పాయల్ శంకర్ - BJP MLAS Fires on Congress Party

కౌలు రైతుల ఊసే లేదు : రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించలేదు కాబట్టి తాను నిరసన చేస్తే బాగుంటుందా అని పాయల్‌ శంకర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో 64 లక్షల రైతులు రూ.71 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్లు, 44 లక్షల రైతులు అన్నట్లుగా లెక్కలు చెబుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో కౌలు రైతుల ఊసే లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటున్నారని దుయ్యబట్టారు.

ఫసల్ బీమా జాప్యం : రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పింది తప్పితే జులై నెల ముగుస్తున్నా ఇంకా అమలు చేయడం లేదని పాయల్ శంకర్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. 6 నెలల్లో మెగా డీఎస్సీ పేరుతో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారని, ఏడు నెలలు గడిచిపోయిందని గుర్తు చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవని, గత పదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్​లలో నిధులు లేవని పాయల్‌ శంకర్‌ తెలిపారు. ఐటీడీఏలకు నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉందని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

"గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోదీని నిందించడం వల్ల ఏం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ఉందనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించలేదంటూ మాట్లాడుతున్నారు. మీరు ఈ బడ్జెట్​లో ఏఏ జిల్లాలకు నిధులు కేటాయించాలో చెప్పాలి". - పాయల్‌ శంకర్‌, బీజేపీ నేత

డైరెక్ట్​గా సీఎం కావడంతో రేవంత్​రెడ్డికి సరైన అవగాహన లేదు : ఏలేటి మహేశ్వర్​రెడ్డి - BJP MLA Alleti on Budget

అంకెల గారడీ, ఆర్భాటం తప్ప బడ్జెట్​లో ఏమీ లేదు : బీజేపీ - BJp on Telangana Budget 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.