BJP Palleku podam Program: బీజేపీ అధిష్టానం గ్రామ్ గ్రామ్ కే చలో (పల్లెకు పోదాం) కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లాలో పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టారు. కృష్ణ జిల్లా పామర్రు నియోజకవర్గంలో పురందరేశ్వరి పర్యటన నేపథ్యంలో, ముందుగా నిమ్మకూరు చేరుకుని నందమూరి రామారావు, బసవతారకంల విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పిచారు. అనంతరం కోసూరు, కాజా, గ్రామాలలో పర్యటించారు. కాజా గ్రామంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
బీజేపీ ఎన్నికల నగారా: కృష్ణాజిల్లా మొవ్వ మండలం కాజా, కోసూరులలో బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమంలో చేపట్టింది. ఈ కార్యక్రంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. పురందేశ్వరి ఇంటింటికి తిరుగుతూ బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజానీకానికి వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు వీధి వీధినా పురందేశ్వరికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల నగారా మొగించిందని పురందేశ్వరి తెలిపారు. ఏపీలోని 21వేల గ్రామాలకు బీజేపీ కార్యకర్తలు వెళ్లాలని లక్ష్యంతో పల్లెకి పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ప్రజలకు చేరువ చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్య్రం లేదు : దగ్గుబాటి పురందేశ్వరి
కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోంది: రాష్ట్రంలోని రోడ్లలో గోతులు కూడా పూడ్చలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం వేసిన రోడ్లే సవ్యంగా ఉన్నాయని పురందేశ్వరి పేర్కొన్నారు. నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. జల్ జివన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు సైతం సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలను దారుణంగా మోసం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను మరిచిపోయిన సీఎం జగన్ నరం లేని నాలికతో మాయ మాటలు చెప్తున్నాడన్నారు.
లెక్కలు తప్పిన జగన్ సర్కారు- ప్రాథమిక పాఠశాలల్లో 32 వేల 425 ఉపాధ్యాయ పోస్టులు
మెగా డీఎస్సీ పేరుతో మోసం: సంక్షేమ కార్యక్రమాల్లో సింహ భాగం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అని పురందేశ్వరి పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం సుమారు 8లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో మెగా డిఎస్సీ పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్, కేవలం 6వేల పోస్ట్‌లతో డీఎస్సీ నోటీఫికెషన్ వేశారని విమర్శించారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బీజేపీ 'పల్లెకు పోదాం'- ఈ నెల 12 నుంచి 21 వేల గ్రామాల్లో పర్యటన