Bird Flu in Nellore District: నెల్లూరు జిల్లా పొదలకూరు, కొవూరు మండలాల్లో కోళ్ల మరణానికి ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కారణమని భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్ వెల్లడించింది. మూడు రోజుల క్రితం చనిపోయిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ పంపిన అధికారులకు ల్యాబ్ నుంచి వివరాలు అందాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే భారీ ఎత్తున కోళ్లు మృతి చెందినట్టు పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేసినట్టు పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. బర్డ్ ఫ్లూ సోకి భారీగా కోళ్లు మృతి చెందిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని ఇన్ ఫెక్టెడ్ జోన్ గానూ, పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని సర్విలెన్స్ జోన్ గానూ అధికారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ గుర్తించిన ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
గబ్బిలాల నుంచి కొత్త రకం వైరస్- కరోనా స్థాయిలో విజృంభణ!
ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన అధికారుల టాస్క్ ఫోర్సు బృందాలు బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలపైనా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, గడిచిన మూడు రోజులుగా ఎలాంటి కోళ్ల మరణాలు నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఏపీలో కోళ్ల ఉత్పత్తి అధికంగా ఉండే కృష్ణా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించకుండా చర్యలు చేపట్టినట్టు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది.
Nipah Virus Spread : 'నిఫా' వైరస్ విజృంభణ.. కేరళ సర్కార్ హై అలర్ట్.. ఆ రెండు వారాలు కీలకం!
Bird Flu Precautions: పక్షుల నుంచి మానవులకు ఈ వైరస్ వ్యాప్తి చెందడం చాలా అరుదని వైద్య ఎయిమ్స్ నిపుణులు చెప్తున్నారు. అలాగే మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ చెందుతుంది అనడానికి ఆధారాలు లేవని తెలిపారు. అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే కోళ్ల పౌల్ట్రీకి దగ్గర్లో పనిచేసే వ్యక్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. సరిగా వండిన పౌల్ట్రీ వంటకాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. సరైన ఉష్ణోగ్రతల వద్ద వండిన పదార్థాల నుంచి వైరస్ వ్యాపించదని ఆ వేడికి వైరస్ నశిస్తుందని చెప్తున్నారు. వైరస్ సోకిన పక్షులకు తగిన దూరం పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
Nipah Virus In Kerala : కొవిడ్‌తో పోల్చితే నిఫా చాలా డేంజర్.. ICMR బిగ్ వార్నింగ్!