ETV Bharat / state

మీ బైక్​ పోయిందా? అయితే ఇక మర్చిపోవడమే! - ఎందుకో తెలుసా? - Bike Theft Cases in Hyderabad - BIKE THEFT CASES IN HYDERABAD

Bike Theft Cases in Hyderabad : సర్​ నా బైక్​ పోయింది. తొందరగా పట్టుకోరా అంటూ ఓ వాహన యజమాని పోలీస్​ స్టేషన్​కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. సరేలే వెతుకుతాం అని చెప్పి అతని చిరునామా తీసుకుని వెళ్లిపో అంటారు పోలీసులు. అప్పుడు ఫిర్యాదుదారుడు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయండి అని అడిగితే కొన్ని రోజులు చూసి చేద్దాము లే అని సర్ధి చెప్పి అక్కడి నుంచి యజమానిని పంపించేస్తారు. అక్కడి నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా యజమానికి బైక్​ సమాచారం అనేది తెలియలేదు. ఇది పోలీసులు బైకు చోరీ కేసుల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యం. ఇప్పుడు దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Bike Theft Cases in Hyderabad
Bike Theft Cases in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 2:19 PM IST

Bike Theft Cases in Hyderabad : సర్​ నా బైక్​ పోయింది. తొందరగా పట్టుకోరా అంటూ ఓ వాహన యజమాని పోలీస్​ స్టేషన్​కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. సరేలే వెతుకుతాం అని చెప్పి అతని చిరునామా తీసుకుని వెళ్లిపో అంటారు పోలీసులు. అప్పుడు ఫిర్యాదుదారుడు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయండి అని అడిగితే కొన్ని రోజులు చూసి చేద్దాము లే అని సర్ధి చెప్పి అక్కడి నుంచి యజమానిని పంపించేస్తారు. అక్కడి నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా యజమానికి బైక్​ సమాచారం అనేది తెలియలేదు. ఇది పోలీసులు బైకు చోరీ కేసుల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యం. ఇప్పుడు దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటుందని బాధితులు తెలుపుతున్నారు. ఇది అన్ని ఠాణాలకు వర్తించదు. ఎందుకంటే కొన్ని పోలీస్​ స్టేషన్లలలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాలు తనిఖీ చేయడం, ఇతర ఆధారాలతో దొరబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా మెజార్టీ కేసులలో ఇది జరగడం లేదు.

ముఖ్యంగా చెప్పాలంటే ఎఫ్​ఐఆర్​ నమోదులో విపరీతమైన జాప్యం జరుగుతోందని, ఒకవేళ ఎఫ్​ఐఆర్​ నమోదైతే వాహనం దొరికాక యజమానికి అప్పగించడానికి కోర్టు అనుమతి, చోరీ చేసిన వ్యక్తిని రిమాండ్​కు పంపడం వంటి సమస్యలు వస్తాయని భావించి వేచి చూసే ధోరణికి పోలీసులు అలవాటుపడ్డారు. పోలీసుల ఈజీ ప్రాసెస్​కు బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరికొంత మందైతే వాహన బీమా పాలసీని పొందలేని పరిస్థితి ఎదురవుతుంది.

కేసు లేకుండా ఎదురుచూపులు : హైదరాబాద్​ నగరం పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా 4 వేలకు పైగా వాహనాలు చోరీకి గురవుతున్నాయనేది అంచనా. ఇందులో రికవరీ మాత్రం 50 నుంచి 70 శాతం వరకూ ఉంటోంది. మెజార్టీ కేసుల్లో నిందితులు చిక్కిన సరే ఆ తర్వాత కూపీ లాగినప్పుడే వాహనం గుట్టు అనేది బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా నడిపిస్తూ చోరీలు చేస్తుంటాయి. ఈ కొట్టేసిన బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం, తక్కువగా మార్చడం, వాహనం కొత్తది, కండీషన్​ బాగుంటే ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు వాటిని విక్రయిస్తుంటారు. ఇలాంటి కేసులను రికవరీ చేయడం చాలా క్లిష్టతరమైన విషయం అని పోలీసులు చెబుతున్నారు.

మిగిలిన కేసుల్లో పరిస్థితి వేరు : మైనర్లు, యువత జల్సాలు, చేతి ఖర్చుల కోసం వాహనాలు దొంగిలిస్తారు. బార్లు, రద్దీ ప్రదేశాలు, రోడ్ల వెంట పార్కింగ్​ చేసినప్పుడు అదను చూసి వాటిని కొట్టేస్తారు. అలాగే నంబరు ప్లేటు మార్చి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఈ తరహా కేసుల్లో చోరీ అయిన వాహనాలు రోజుల వ్యవధిలో మరో పోలీస్​ స్టేషన్​ పరిధిలో పోలీసులకు చిక్కుతుంటాయి. అప్పుడు ఆయా పోలీస్​ స్టేషన్ల పరిధిలో చిక్కిన వాహనాల రిజిస్ట్రేషన్​ నంబర్లు ఆధారంగా పోలీసులు యజమానులను సంప్రదిస్తుంటారు. దీంతో వాహనం చోరీకి గురైన ప్రాంతం, దాని ఆచూకీ లభ్యమైన ప్రాంత పోలీసులు మాట్లాడుకుని యజమానులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉదాహరణలు :

  • మెట్రో దగ్గర పార్కింగ్​ చేసిన వాహనం చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నాలుగు నెలలు గడుస్తున్నా వాహన ఆచూకీ మాత్రం చిక్కలేదు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తే బీమా క్లెయిమ్​ చేస్తానని చెప్పినా స్పందించడం లేదు.
  • హైదరాబాద్​ నగరు శివారు ప్రాంతంలో వారం రోజుల క్రితం బైకు చోరీ జరిగింది. చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. వాహనం కొట్టేసిన దొంగ మిడ్జిల్​ వరకూ వెళ్లి అక్కడ పెట్రోల్​ అయిపోగా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడి పోలీసులు వాహనం నంబరు ఆధారంగా యజమానిని సంప్రదించి, చోరీ జరిగిన ఠాణాలో కేసు రిజిస్టర్​ అయితేనే తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వాహనాన్ని అప్పగిస్తామని మిడ్జిల్​ పోలీసులు వాహన యజమానికి చెప్పారు. కేసు నమోదు సమయంలో ఎఫ్​ఐఆర్​ చేయకపోవడంతో బాధితుడు పోలీస్​ స్టేషన్​ చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!

భార్య ఔటింగ్​ ఖర్చుల కోసం బైక్​ దొంగగా మారిన భర్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.