ETV Bharat / state

సెప్టెంబర్ 5న విచారణకు హాజరుకండి - కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు - Bhupalapalli court notices to KCR

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 7:24 PM IST

Bhupalappalli court issued notices to KCR : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వైఫల్యం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో నోటీస్‌ అందింది. సెప్టెంబర్‌ 5న విచారణకు హాజరు కావాలంటూ బీఆర్‌ఎస్‌ అధినేతతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, మరో 8 మందికి భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.

KCR
Bhupalapalli Court Notices to KCR (ETV Bharat)

Bhupalapalli Court Notices to KCR : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఫల్యాలపై విచారణ నిమిత్తం సెప్టెంబర్ 5న విచారణ కోసం హాజరు కావాలంటూ భూపాలపల్లి కోర్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరికొందరికీ నోటీసులిచ్చింది. రూ.లక్ష కోట్ల వ్యయం చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటి కేసీఆర్ సర్కారే కారణమని, దీనివల్ల భారీగా ప్రజా ధనం దుర్వినియోగం అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతిందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలంటూ పిటిషనర్ రాజ లింగమూర్తి భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

బ్యారేజీ దెబ్బతిన్న అంశంపై సమగ్ర విచారణ చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు నాటి మంత్రి హరీశ్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, అప్పటి చీఫ్ ఇంజినీర్లు, మేగా సంస్థ నిర్మాణదారులు భాగమేనని, వీరందరిపై విచారణ చేపట్టి శిక్షించాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, నిర్మాణానికి ముందు కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని పిటిషనర్ ఆరోపించారు.

లోపాలను దాచే ప్రయత్నం చేశారు : పదే పదే డిజైన్లు మార్చారని, నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని పేర్కొన్నారు. వర్షాలు, వరదల ముందు, ఆ తర్వాత చేయాల్సిన పరీక్షలను, తనిఖీలను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన పలు టెక్నికల్ అంశాలను డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరినా ఇవ్వకుండా లోపాలను దాచే ప్రయత్నం చేశారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన భూపాలపల్లి కోర్టు, ఈ అంశంలో విచారణ నిమిత్తం సెప్టెంబర్ 5వ తేదీన హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్‌ రావులతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.