Bhumana Came to Tirumala to Take oath on Laddu Adulteration: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో హంగామా చేశారు. లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ కొండపైకి వెళ్లిన భూమన పుష్కరిణిలో మునిగి మాఢవీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. అనంతరం రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేయబోగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకున్నారు. కొండపైన రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులు ఇచ్చారు. ప్రమాణం చేయకుండానే తిరుమల నుంచి భూమన వెనుదిరిగారు.
కేసు నమోదు: భూమన కరుణాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దంటూ తిరుమలకు చేరుకునే ముందే తనిఖీ కేంద్రం వద్ద నోటీసులిచ్చారు. అయినప్పటికీ నోటీసులను భూమన బేఖాతరు చేశారు. దీంతో భూమనపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
'అచ్చుతప్పులు, అభూత కల్పనలు'- సినీ నటి కేసులో కీలక సూత్రధారులపై విచారణ - Kandambari Jethwani case