ETV Bharat / state

పీవీ స్వగ్రామంలో సంబురాలు - జిల్లాకు ఆయన పేరును పెట్టాలని గ్రామస్థుల వినతి - Bharat Ratna PV Narasimha Rao

Bharat Ratna PV Hometown Celebrations : మాజీ ప్రధాని పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఆయన స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. వంగర గ్రామస్థులు ర్యాలీ నిర్వహించి, టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పీవీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మిఠాయిలు పంచారు. భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్థులు, జిల్లాకు పీవీ పేరును పెట్టాలని కోరారు.

Bharat Ratna PV Narasimha Rao
Bharat Ratna PV Hometown Celebrations
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 5:55 PM IST

Updated : Feb 9, 2024, 6:35 PM IST

పీవీ స్వగ్రామంలో సంబురాలు - జిల్లాకు ఆయన పేరును పెట్టాలని గ్రామస్థుల వినతి

Bharat Ratna PV Hometown Celebrations : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదకేవరపల్లి మండలం వంగరలో కుటుంబస‌భ్యులు, గ్రామస్థులు(Villagers) హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ నరసింహారావు'

ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఆలస్యంగానైన గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పీవీ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో పోరాటాలు, ధర్నాలు, విజ్ఞప్తుల తరువాత ఈ గౌరవం దక్కిందని వెల్లడించారు. బహుభాషా కోవిదుడు, మైనారిటీ ప్రభుత్వ(Minority Govt) పరిపాలనలో కూడా విజయవంతంగా పరిపాలించిన వ్యక్తిగా పీవీని కొనియాడారు.

పీవీ జిల్లా ప్రకటనకై గ్రామస్థుల వినతి : ఎన్నో భూసంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చేసిన ఘనత పీవీకే సొంతమని గుర్తు చేశారు. భారతరత్న అవార్డుతో పాటు అందరూ ప్రధాన మంత్రులకు గౌరవించినట్లుగానే పీవీ నరసింహారావును కూడా గౌరవించి దిల్లీలో పీవీ సమాధితో కూడిన పీవీ ఘాటును నిర్మించాలని గ్రామస్థులు కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పీవీ జిల్లాను(PV District) ప్రకటించాలని, పీవీ నరసింహారావు పేరుపై ఓ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా - పీవీ ప్రస్థానం సాగిందిలా

"పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం యావత్ దేశానికి, మా గ్రామానికి గర్వకారణం. దేశం మొత్తం హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. పార్టీలకు అతీతంగా సుస్థిరకాలం ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత, పీవీది. ఇదే భారతరత్న ఎప్పుడో ఇవ్వాలని మేము ఆకాంక్షించాము కానీ ఆలస్యమైంది. దీనికోసం మేము నిరాహార దీక్ష సైతం చేశాం. ఏదైమైనప్పటికీ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి వంగర గ్రామం తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం."-వంగర గ్రామస్తులు

PV Narasimha Rao Developed Manthani Constituency : ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేశారని గుర్తు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో 1976 లోనే మంథని నుంచి కాళేశ్వరం(Kaleshwaram) వెళ్లేందుకు వీలుగా స్ప్రింగ్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత పీవీ నరసింహారావుదని కాటారం ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు సైతం తన వ్యక్తిగత వంటమనిషి మంథనివాసే : మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి పదవితో పాటు ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన నరసింహారావు తన వ్యక్తిగత వంట మనిషిగా మాత్రం మంథనికి చెందిన రంగి కిషోర్​నే ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి అయిన ప్రధాని అయిన తమ ప్రాంతానికి గొప్ప పేరును తీసుకువచ్చారని ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతరత్న(Bharat Ratna) బిరుదును ప్రకటించిన సందర్భంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

పీవీ రాజకీయ జీవితంలో ఆ ఐదేళ్ల కాలం ఎంతో కీలకం, చరిత్రాత్మకం

'పీవీకి భారతరత్న - తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం'

Last Updated : Feb 9, 2024, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.