Bharat Biotech CEO Krishna Ella Charge over as IVMA President : ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ)కి అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ కృష్ణ ఎల్ల బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఐవీఎంఏ ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఐవీఎంఏ వెల్లడించింది. మాజీ అధ్యక్షుడు అదర్ సి పూనావాలా నుంచి కృష్ణ ఎల్ల బాధ్యతలు స్వీకరించారు.
బయోలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా భారత్ బయోటెక్ సీఎఫ్ఓ శ్రీనివాస్ కోశాధికారిగా, డాక్టర్ హర్షవర్ధన్ ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ప్రాణాలను కాపాడే వ్యాధి నిరోధక టీకాలను అందరికీ అందించటమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు.