ETV Bharat / state

బెంగళూరులో బాలుడు మిస్సింగ్​- హైదరాబాద్​ మెట్రోలో ప్రత్యక్షం

Bangalore Boy Missing Case in Hyderabad : మూడు రోజుల క్రితం బెంగళూరులో ట్యూషన్​కి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే క్రమంలో సామాజిక మాధ్యామాన్ని ఉపయోగించుకున్నారు. చివరికి ఆ బాలుడుని హైదరాబాద్​లోని మెట్రోలో బెంగళురు నివాసి గుర్తించి పోలీసులకు, బాలుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. చివరికి బాలుడ్ని పోలీస్​ స్టేషన్​లో తన తల్లిదండ్రులకు అప్పగించారు.

12 Years Boy Missing case Hyderabad
Bangalore Boy Missing Case in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 4:00 PM IST

Updated : Jan 24, 2024, 4:50 PM IST

Bangalore Boy Missing Case in Hyderabad : మూడు రోజుల క్రితం 12 సంవత్సరాల బాలుడు బెంగళూరులో ట్యూషన్​కి వెళ్లి ఇంటికి వెళ్లే క్రమంలో తల్లిదండ్రుల కోసం ఎదురుచూశాడు. కట్​చేస్తే ఆరోజు పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టగా బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్లినట్టు గుర్తించారు. అనంతరం సోషల్​ మీడియా ద్వారా వెతకడం ప్రారంభించారు. చివరికి ఇవాళ హైదరాబాద్​ మెట్రోలో ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరు వాసి ఆ బాలుడ్ని గుర్తించగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు బాలుడి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. దీంతో కథ సుఖాంతమయింది.

ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య - ఆపై కిడ్నాప్ డ్రామా

Parinav Missing Case : నాంపల్లి పోలీస్​ స్టేషన్ సీఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు పరిణవ్​ స్థానిక పాఠశాల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 21న ట్యూషన్​కు వెళ్లి ఇంటి నుంచి బయల్దేరాడు. ట్యూషన్​ అయిపోయిన తరవాత ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బాలుడు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు.

వ్యక్తి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం - పటాన్​చెరు సీఐపై సస్పెన్షన్ వేటు

12 Year Boy Missing Case in Bangalore : ఆదివారం ఉదయం 11 గంటలకు ట్యూషన్​ సెంటర్​ నుంచి పరిణవ్​ బయటకు వచ్చాడు. అక్కడి నుంచి బస్సులో వెళ్లినట్లు సీసీటీవీలో పోలీసులు గుర్తించారు. చివరిగా బెంగళూరులోని మేజిస్టిక్​ బస్టాండ్​ దగ్గర కనిపంచాడు(Bangalore Boy Missing Case). ఆ తరవాత ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. ఆ బస్టాండ్​ నుంచి కర్ణాటకలోని అన్ని జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు బస్సులు వెళ్తున్నందున పోలీసులకు కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ సమయంలోనే బాలుడు ఆచూకీ తెలిపాలని ఫోటోలు, వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్​ చేశారు. అవి కాస్తా వైరల్​గా మారాయి.

ఇన్​స్టాగ్రాం ద్వారా పరిచయమైన అబ్బాయిలను కలిసేందుకు తొమ్మిదో తరగతి అమ్మాయిల ప్లాన్

12 Year Boy Missing Viral Videos : వైరల్​ మారడంతో హైదరాబాద్​లో ఉంటున్న బెంగళూరు వాసి ఆ దృశ్యాలను చూసి, ఆ బాలుడ్ని నాంపల్లి మెట్రో స్టేషన్​లో గుర్తించాడు. బెంగళురులో కనిపించకుండా పోయిన పరిణవ్​(Parinav Missing Case) అని నిర్ధారించుకున్నాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. అనంతరం నాంపల్లి పోలీసులు బాలుడ్ని తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారికి అప్పగించారు. తన కుమారుడు కనుగొనేందుకు సాయం చేసిన సోషల్​ మీడియా యూజర్లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

"ఇవాళ ఉదయం బెంగళూరు బాలుడు ఉన్నాడని ఓ వ్యక్తి తెలిపాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి పిల్లవాడ్ని సంరక్షించాం. ఆ బాలుడు తల్లిదండ్రులు వచ్చిన తరవాత వారికి అందజేశాం. ఆ విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడని తెలుసుకున్నాం. ఈ నెల 21న బెంగళూరులో తప్పిపోయాడని గుర్తించాం. చివరికి నాంపల్లి మెట్రోలో ఆచూకీ లభించింది."- అభిలాష్, నాంపల్లి పోలీస్​ స్టేషన్ సీఐ

బెంగళూరులో బాలుడు మిస్సింగ్​- హైదరాబాద్​ మెట్రోలో ప్రత్యక్షం

తప్పిపోయిన బాలుడి ఆచూకీ కనిపెట్టిన పోలీస్​ డాగ్ 'లియో'-రంగంలోకి దిగిన 90 నిమిషాల్లోనే!

Last Updated : Jan 24, 2024, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.