Bamboo Crash Barrier In Nizamabad : తెలంగాణలో మొదటి సారిగా హైదరాబాద్ - నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ ప్లాజా పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న పది చోట్ల కొత్తగా బాంబూ క్రాష్ బారియర్‌గా (Bamboo Crash Barrier) పిలిచే సైడ్ రెయిలంగ్లను ఏర్పాటు చేశారు. వీటిని ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేస్తున్నారు. ప్రాణ, వాహన నష్టాలను తగ్గించడానికే వీటిని ఏర్పాటు చేశారు. కంటి చూపుతోనే ప్రమాదకరమైన మలుపు, ప్రమాదకర ప్రాంతాలను బాంబూ క్రాష్ బారియర్ ద్వారా పసిగట్టవచ్చు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
సొంతూరి బాట పట్టిన నగరవాసులు - హైదరాబాద్ టు విజయవాడ రూట్లో ఫుల్ రష్
Bamboo Crash Barrier : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి నుంచి కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఈ వెదురుతో చేసిన సైడ్ రెయిలింగ్ అమర్చారు. ఒక కిలోమీటర్ దూరం వరకు ఐరన్‌తో కూడిన రెయిలింగ్‌కు అయ్యే రెట్టింపు ఖర్చుతో బాంబూ క్రాస్ బారియర్ నిర్మించారు. ఎంపిక చేసిన వెదురు బొంగుకు ప్రత్యేకమైన కలర్ వేయడం ద్వారా కర్ర పూర్తిగా ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని వెంటనే పడిపోకుండా నిలిపే శక్తి ఉంటుంది. తద్వారా వాహనం రోడ్డు కిందకు పడిపోకుండా వెదురు రెయిలంగ్ వెనక్కు నెట్టే ప్రయత్నం చేస్తుంది.
బాంబూ క్రాష్ బారియర్ : తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించి ప్రాణ, ఆస్తి నష్టం నివారిస్తుందని ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశారు. వెదురుతో తయారు చేసిన రెయిలింగ్ వాడటం అంటే సహజ వనరులను వినియోగించాల్సి వస్తున్నందున వెదురు వల్ల పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుందని జాతీయ రహదారుల సంస్థ (National Highways Corporation) భావిస్తోంది. వెదురు వాడకం వల్ల రైతులకు ప్రయోజనం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన వెదురు రెయిలింగ్‌లు సత్ఫలితాలు ఇస్తే, రాబోయే రోజుల్లో జాతీయ రహదారికి ఇరువైపులా అవే వాడనున్నారు.
"NH-44 రహదారిలో ఆర్మూర్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు 60 కిలోమీటర్ల హైవేలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌ను గుర్తించాం. ఒక కిలోమీటర్ దూరం వరకు ఐరన్‌తో కూడిన రెయిలింగ్‌కు అయ్యే రెట్టింపు ఖర్చుతో బాంబూ క్రాష్ నిర్మించాం. ఈ వెదురు బొంగు కర్ర ప్లాస్టిక్‌లాగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని వెంటనే పడిపోకుండా నిలిపే శక్తి ఉంటుంది. వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించి ప్రాణ, ఆస్తి నష్టం నివారిస్తుంది. దీన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశాం."-అనిల్ కుమార్ సింగ్, ప్రాజెక్టు మేనేజర్, ఇందల్వాయి టోల్ ప్లాజా, నిజామాబాద్ జిల్లా
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
రాష్ట్రంలో రీజినల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా - గడ్కరీతో ఫలించిన సీఎం చర్చలు