Balka Suman Fires On Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడం ఖాయమనిపిస్తోందని, మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వ శర్మ అవుతారని మోదీ దగ్గర బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని వ్యాఖ్యానించారు. రేవంత్ తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట విమానాశ్రయంలో చర్చలు జరిపారని ఆరోపించిన సుమన్ పార్లమెంటు ఎన్నికల (Parliament Elections) తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని చెప్పారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
Balka Suman Comments On Congress : టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు సహకరించిందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరవు ఉండేదన్న ఆయన చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరవు వచ్చిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో కూడా మార్పు వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఫోటో ప్రకటనల్లో ఇప్పటికే అదృశ్యమైందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని తెలిపారు.
తెలంగాణలో ఇకపై రైతు ఆత్మహత్యలు లేకుండా చూసుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు
రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలని కోరిన సుమన్ భవిష్యత్ అవసరాల దృష్ట్యానే బీజేపీ రేవంత్‌తో కలిసి పని చేస్తోందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ పోకడలను గమనించి పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెప్పాలని బాల్క సుమన్ కోరారు.
"పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడం ఖాయం. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వ శర్మ అవుతారు. మోదీ దగ్గర బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోంది. రేవంత్ తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట విమానాశ్రయంలో చర్చలు జరిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారు." - బాల్క సుమన్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన ఎన్డీఎస్ఏ బృందం - సీపేజీ నాణ్యతా లోపాలపై ఆరా!