Hero Balakrishna Golden Jubilee Celebrations in US : తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు అమెరికాలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలో బోళ్ల, తరణి పరుచూరి అధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేశారు. 1974 లోనే తెలుగు చిత్ర రంగంలోకి బాలకృష్ణ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన నటించిన చిత్రాలు, చేసిన పాత్రల గురించి అభిమానులు ప్రస్తావించారు.
జై బాలయ్య - స్వర్ణోత్సవ నట రాజసం
ఆయన తొలి చిత్రం 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న విడుదలైంది. అంటే యాభయ్యేళ్లుగా ఆయన తిరుగులేని ప్రయాణం చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా, వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యకు సుదీర్ఘంగా డైలాగ్‌లు చెప్పడంలో అందెవేసిన చేయి. కెరీర్లో వందకు పైగా చిత్రాలు, వందలాది పైగా వేషధారణలు, చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటుడిగా నిలిచారాయన. తన తరంలో డబల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఏకైక నటుడిగానూ రికార్డు సృష్టించారు!
సెలవు పెట్టించి మరీ చెన్నైకి- 'తాతమ్మ కల' సెట్లో నాపై నాన్న ఫుల్ ఫైర్: బాలయ్య
మాస్ కథలతో పూనకాలు తెప్పించడం, క్లాస్ కథలతో మెప్పించడం బాలయ్యకే సాధ్యమైంది. మంగమ్మగారి మనవడుగా, నారీ నారీ నడుమ మురారిగా కెరీర్ ఆరంభంలో సాంఘిక చిత్రాలతో అదరగొట్టిన ఆయన ఆ తర్వాత తొడగొట్టి ఫ్యాక్షన్ కథలతో తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పారు. ఖడ్గం చేతపట్టి 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా రాజసాన్ని ప్రదర్శించారు. పౌరాణిక గాథలతో ఎన్టీఆర్ తర్వాత, ఆ కథలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. 'ఆదిత్య 369' లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు, భైరవద్వీపం' తరహా జానపద చిత్రాలు - ఇలా ఎన్నో ప్రయోగాలు చేశారు. అందుకే ఆడియెన్స్‌కు బాలకృష్ణ సినిమాలంటే పచ్చి. అసలు అభిమానులకైతే ఓ పెద్ద సంబరం. వంద రోజులు కాదు, సిల్వర్ జూబ్లీలు కాదు, వెయ్యి రోజుల వరకు థియేటర్లలో ఆ సంబరాలు కొనసాగుతూ ఉంటాయి.
బాలయ్య మాత్రమే సాధించిన రేర్ రికార్డ్స్ - ఈ 12 విషయాల గురించి మీకు తెలుసా?