Ram Mandir Prana Pratishtha Telugu : అయోధ్యలో సోమవారం శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మామిడి తోరణాలు వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు. రేపు (జనవరి 22వ తేదీ) ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు శోభాయాత్ర వంటి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం సీతారాములకు నిత్య కల్యాణ మండపం వద్ద బంగారు పుష్పాలతో అర్చన చేసి అనంతరం భక్తులతో కలిసి సీతారాములను పట్టణ పురవీధుల్లో శోభాయాత్రను చేయనున్నారు. అయోధ్య రాముడి ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు.
Prana Pratishta Pooja in Bhadradri Temple : మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం హజరత్ నాగుల్ మీరా దర్గాలో అయోధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కులమతాలకు అతీతంగా దర్గాలో రామయ్య పూజలు అందుకోనున్నాడు. ఈ దర్గాలో ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలతో పాటు శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈనెల 22న పట్టాభిరామునికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజాం కాలేజ్ మైదానంలో అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్
ఈ కార్యక్రమం కోసం సంప్రదాయ రీతిలో దంచిన పిండితో మహిళలు మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సత్యనారాయణపురం రామాలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇక రేపు సాయంత్రం ఆలయంలో దీపాలను వెలిగించి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పొంగలి ప్రసాదాన్ని అందించనున్నారు.
అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి 1265 కిలోల భారీ లడ్డు
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భక్తి భావం నెలకొంది. ఈ క్రమంలో తమలోని భక్తి భావంతో స్వామివారికి కానుకల రూపంలో బహుకరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన అంజయ్య చారి నెలరోజుల పాటు కష్టపడి రూ.5 లక్షల విలువైన రథాన్ని స్వామివారికి తన తల్లిదండ్రుల పేరిట బహుకరించారు. ఈ నేపథ్యంలో స్వామివారిని గ్రామ పురవీధుల గుండా ఊరేగించడానికి ఈ రథాన్ని ఆలయ నిర్వాహకులు వినియోగించనున్నారు.
Seetharam Art With Nose in Hyderabad : హైదరాబాద్ నిజాంపేట్‌లోని సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నాసికతో సీతారాములవారిని చిత్రీకరించాడు. ఇది వరకే దేవుళ్లు, ప్రముఖుల అనేక చిత్రాలను వేసిన ఆయణ్ను పలువురు ప్రశంసించారు.