Attack on Dastagiri Father at Namaalagunda: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు రోజురోజుకీ పెచ్చురిల్లుతున్నాయి. సీఎం జగన్‌పై పోటీ చేసేంత ధైర్యం నీ కుమారునికి (దస్తగిరికి) ఉందా? అంటూ దాడి చేశారని తన తండ్రిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారని దస్తగిరి వాపోయారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి తండ్రి షేక్ హాజీవలీపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి జాగరణ కోసం వెళ్లిన దస్తగిరి తండ్రిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం జగన్‌పై పోటీ చేసేంత ధైర్యం నీ కుమారునికి ఉందా? అంటూ దాడికి పాల్పడ్డారని, అసభ్య పదజాలం వినయోగిస్తూ విచక్షణారహితంగా తలపైన తీవ్రంగా కొట్టినట్లు బాధితుడు తెలిపారు.
ప్రస్తుతం బాధితుడు పులివెందులలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దస్తగిరి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో చేరాడు. పులివెందుల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా (Pulivendula MLA candidate Dastagiri) ఆ పార్టీ తరఫున బరిలో నిలవనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు దస్తగిరి కుటుంబంపై దౌర్జన్యాలకు తెగ బడుతున్నారని బాధితుడు పేర్కొన్నాడు.
వైసీపీ నేతల విధ్వంసం - దళితులపై దాడి చేసి, గుడిసెలకు నిప్పుపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు
Dastagiri Questioned Raftadu MLA Prakash Reddy: జై భీమ్ భారత్ పార్టీ నాయకులపై దాడిలో తమ ప్రమేయం లేదన్న రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితులను (Dalits) ఎందుకు పరామర్శించలేదని ఆ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నా ఎస్టీ, నా బీసీలు అన్న మాటలే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దస్తగిరి పేర్కొన్నారు. జగనన్న ఇళ్లకు అనేక షరతులు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేశారని దస్తగిరి విమర్శించారు. పేదల కోసం జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే వాటికి నిప్పు పెట్టి అడ్డుకున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని దస్తగిరి ఆరోపించారు.పార్టీ నాయకులపై దాడులను ఖండిస్తూ అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దస్తగిరి నిరసన తెలిపారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం నష్టం జరిగినా జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని దస్తగిరి చెప్పారు.
"దళిత ఇళ్లకు నిప్పు పెట్టి,దౌర్జన్యంగా వారిపై దాడి చేశారు. నా ఎస్టీ, నా బీసీలు, మైనారిటీ వర్గాలు అనేవి నోటి మాటలే కాని చేతలు ద్వారా జరిగే పని కాదు."
-దస్తగిరి, జై భీమ్ భారత్ పార్టీ నేత
దళితులపై దాడి చేపిన వారిపై ఒక్క కేసు పెట్టని జగన్- వర్ల రామయ్య
దళితులపై దాడి: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయి దళిత కాలనీలో పూరిళ్లను తగలబెట్టిన విషయం తెలిసిందే. గ్రామంలోని రెవెన్యూ పరిధిలో రెండెకరాల్లో స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైసీపీ నాయకులు కన్నేయటంతో అక్కడ నివసిస్తున్న వారిని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని రెండు రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము నిరాకరించడంతో పలుమార్లు దౌర్జన్యానికి దిగారని బాధితులు తెలిపారు.
'వైసీపీ పాలనలో దళితులపై దాడులకు అంతులేదా? ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయం'