ETV Bharat / state

వేర్వేరు కేసుల్లో సైబర్‌ నేరగాళ్ల అరెస్టు - విచారణలో విస్తుపోయే విషయాలు - cyber trading fraud accused arrest

Cyber Trading Fraud in Hyderabad : స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో సైబర్‌ నేరస్థులకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Cyber Trading Fraud in Balkampet
Cyber Crime in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 3:59 PM IST

Cyber Crime in Hyderabad : హైదరాబాద్ నగరంలో సైబర్‌నేరాలు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. ఈజీమనీ, అధిక లాభాలు అంటూ, సైబర్ నేరగాళ్లు మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటువంటి మోసాల్లో చదువుకున్నవాళ్లు సైతం బాధితులుగా మారడం గమనార్హం. తాజాగా నగరంలో ట్రేడింగ్‌ పేరుతో(Cyber Fraud) మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో సైబర్ నేరస్థులకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, దేశవ్యాప్తంగా వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు, కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Cyber Trading Fraud in Balkampet : స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ సాయి గౌడ్‌, సాయికుమార్‌ కలిసి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడ్డారు. బల్కంపేట్‌కు చెందిన బాధితుడి నుంచి 58.6 లక్షల రూపాయలు దండుకున్నారు. దేశవ్యాప్తంగా ఇరువురు నిందితులపై 45 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా 13 కోట్ల రూపాయల మేర మోసాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

సైబర్ బాధితులకు ఊరట - కేసుల పరిష్కారంపై ఈనెల 9న మెగా లోక్అదాలత్‌

మరో కేసులో ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్‌కు చెందిన సురేంద్ర, నరేష్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. మోసాల ద్వారా వచ్చిన డబ్బులో సైబర్ నేరగాళ్లు నిందితులకు 1.5 శాతం కమిషన్ ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు ఇప్పటివరకు నిందితులు 8 ఖాతాలు సమకూర్చినట్టు దర్యాప్తులో తేలింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నిందితుల మీద 83 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Investment Fraud in Hyderabad : మరోకేసులో ఇటీవల పెట్టుబడి పేరిట హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్‌ నేరగాళ్లు లక్షల సొమ్ము కాజేశారు. ఈ జెడ్‌ ఇన్వెస్ట్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి నుంచి 22 లక్షల 16వేల 732 రూపాయలు కొట్టేశారు. అధిక లాభాలు వస్తాయని, అందుకోసం ట్రేడింగ్‌ చిట్కాలు చెబుతామని నమ్మించారు. తర్వాత మోసగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో దఫాల వారీగా వాటాలను కొనుగోలు చేసేలా పెట్టుబడులు పెట్టించారు. చివరకు ఆ డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో మోసం జరిగిందని గ్రహించిన బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు నిందితులను అరెస్ట్ చేశారు.

'మీ పార్శిల్​లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయి - పోలీసులకు చెప్పొద్దంటే నేనడిగిన డబ్బు ఇవ్వాల్సిందే'

పెట్టుబడుల పేరిట 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 22 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.