ETV Bharat / state

సీఎం జగన్ విదేశీ పర్యటన పిటిషన్‌పై కోర్టులో విచారణ - అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ - CM Jagan Foreign Tour Petition

Arguments in CBI Court on CM Jagan Foreign Tour Petition: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈనెల 14కి వాయిదా వేసింది.

cm_jagan_petition
cm_jagan_petition (ETV BHARAT)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 6:09 PM IST

Updated : May 9, 2024, 9:58 PM IST

Arguments in CBI Court on CM Jagan Foreign Tour Petition: విదేశీ పర్యటనకు అనుమతివ్వాలన్న సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టులో జగన్‌ పిటిషన్‌ వేశారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఇప్పటికే కేసుల విచారణ జరుగుతున్నందున.. అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్​కు అనుమతి ఇవ్వవద్దని వాదించింది. ఎన్నికల తర్వాత యూరప్ వెళ్లాలని భావిస్తున్న జగన్ అనుమతి కోసం వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దంటూ బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన షరతును సడలించాలని కోరారు. గతంలో పలుమార్లు కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లివచ్చారని ఎప్పుడూ షరతులు ఉల్లంఘించలేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఈనెల 14కి వాయిదా వేసింది.

Last Updated : May 9, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.