ETV Bharat / state

తహసీల్దార్​తో వాగ్వాదానికి దిగిన తండ్రి, కుమారై - అదే కారణమా?

నాన్​ క్రిమిలేయర్ సర్టిఫికెట్​ కోసం వారం రోజులుగా ఆఫీస్​ చుట్టూ తిరుగుతున్న యువతి

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Argument between Tehsildar and woman
Argument between Tehsildar and woman (ETV Bharat)

Argument between Tehsildar and woman : నాన్​ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం వారం రోజులుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిన యువతి ఇవాళ అధికారిణితో వాగ్వాదానికి దిగింది. స్టాఫ్​ నర్సింగ్ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో తండ్రి, కుమారై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం హేమావతి అనే యువతి తన తండ్రితో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఐదు రోజులగా తిరుగుతున్నా సర్టిఫికెట్​పై సంతకం చేయలేదని రోదిస్తూ ఇవాళ తహశీల్దార్​తో వాగ్వాదానికి దిగారు.

తహసీల్దార్​ సంతకం చేయకుండా దబాయిస్తోందని : నారాయణపురం గ్రామానికి చెందిన అయ్యన్న కూతురు హైమావతి తన అక్క నర్సింగ్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అవసరమని అందుకోసం వచ్చినట్లు తెలిపింది. వారం రోజుల క్రితం కోసం తహశీల్దార్ ఆఫీస్​లో దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. ఐదు రోజులుగా తిరుగుతున్నా ఇంతవరకు సర్టిఫికెట్ మీద సంతకం చేయలేదంటూ అడిగితే ఇప్పుడు పెట్టేది లేదంటూ దబాయిస్తోందని హైమావతి వాపోయింది.

సహనం కోల్పోయిన తండ్రీ, కూతురు : స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఆఖరు రోజు కావడంతో తండ్రీ, కూతురు సహనం కోల్పోయారు. తహశీల్దార్ తీరుపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ చేస్తామంటూ ఆందోళన చేశారు. చివరికి కార్యాలయంలో ఉన్న సిబ్బంది కలగజేసుకొని తహశీల్దార్​కు నచ్చజెప్పడంతో ఆమె సర్టిఫికెట్ మీద సంతకం చేశారు. ఐదు రోజులుగా రోజూ వస్తున్నా సంతకం చేయకుండా వేధించిందని హైమావతి వాపోయింది.

"ఐదు రోజులుగా రోజూ వస్తున్నా సంతకం చేయకుండా సతాయిస్తున్నారు. ఒక్క సంతకం కోసం ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం" - హైమావతి

దళారుల అడ్డా @భద్రాచలం ఎమ్మార్వో ఆఫీస్​.. ఏ పని జరగాలన్నా వారే దిక్కు!

ఎమ్మార్వో కార్యాలయంలో మూకుమ్మడిగా అధికారుల గైర్హాజరు.. కారణం అదే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.