ETV Bharat / state

కృష్ణమ్మ వరద జోరు - ఆక్వా రైతు బేజారు - Aqua Farmers Problems - AQUA FARMERS PROBLEMS

Prawns Damage in Krishna District : కృష్ణమ్మ ఉగ్రరూపం ఆక్వా రైతులకు శాపంగా మారింది. భారీ వరదకు కృష్ణా జిల్లా దివిసీమలోని చెరువులన్నీ మునిగిపోయాయి. సరుకంతా చనిపోవడంతో పెట్టుబడంతా నీటి పాలై నిండా మునిగిపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Aqua Farmers Problems
Aqua Farmers Problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 9:57 AM IST

Aqua Farmers Problems : భారీ వరద కృష్ణా జిల్లాలోని ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో నదీ పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. ఆటు పోట్లుకు సముద్రం ఉప్పునీరు సుమారు 30 కిలోమీటర్ల వరకు కృష్ణానదిలోకి వస్తుంది. రొయ్యల సాగుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంతో నది, కరకట్టకు మధ్యన ఉన్న భూ భాగాన ఎక్కువగా వీటిని సాగు చేస్తున్నారు. దివిసీమలో సుమారు 20,000ల ఎకరాల్లో వీటిని సాగు చేశారు.

గత సర్కార్ విద్యుత్‌ సబ్సిడీలో రాయితీలు ఇవ్వకపోవడంతో చెరువుల్ని కొంతమంది లీజుకు ఇవ్వగా మరికొందరు ఖాళీగా వదిలేశారు. ఇంకొందరు రొయ్యల అమ్మకంలో ఇబ్బందులు మేత ధరలు ఇతర కారణాల వల్ల వాటిని సాగు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వేలాది మంది మళ్లీ రొయ్యల సాగు మొదలు పెట్టారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఉగ్రరూపంతో ఉరకలెత్తిన కృష్ణమ్మ చెరువుల్ని ముంచేసి రైతుల ఆశల్ని చిదిమేసింది.

"వరద వచ్చి చెరువులన్ని మునిగిపోయాయి. మాకు లక్షల్లో నష్టం వాటిల్లింది. రొయ్యలన్ని చనిపోయాయి. అప్పులు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. మేత కట్టలు, మందులు, విద్యుత్‌ పరికరాలు పాడైపోయాయి.పెట్టుబడంతా నీటి పాలైంది. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం. - బాధిత ఆక్వా రైతులు

Krishna River Floods : వరద బీభత్సంతో చెరువుల వద్ద ఎక్కడ చూసినా చనిపోయిన రొయ్యలే కనిపిస్తున్నాయి. రొయ్యలు చుట్టూ వేసిన వలకు పట్టుకుని వేలాడుతున్నాయి. చెరువుల షెడ్లలో వందలాది మేత కట్టలు, మందులు, మోటార్లు అన్ని పూర్తిగా పాడైపోయాయి. చెరువులకు అనేక చోట్ల గండ్లు పడ్డాయి. పెట్టబడంతా బూడిదలో పోసిన పన్నీరైందంటూ రైతులు లబోదిబోమంటున్నారు.

మేత, మందుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగుద్వారా ప్రభుత్వానికి వేలకోట్ల విదేశీ మారకద్రవ్యం తెచ్చి పెడుతున్నామని అంటున్నారు. గత సర్కార్ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తమను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం - ఊళ్లకు ఊళ్లే నీటమునక - Flood Effect in Joint Guntur

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.