APSRTC Employees Problems : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల కష్టాలన్నీ కడతేరుస్తానన్న జగన్ సీఎం అయ్యాక వారికి చుక్కలు చూపించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనమైతే చేశారు గానీ ఉద్యోగులకు కల్పించాల్సిన అదనపు ప్రయోజనాలకు పాతరేశారు. పాత పింఛన్ విధానం కోసమే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనాన్ని కోరుకున్నారు. కానీ ఐదేళ్లలో ఆ ఊసెత్తలేదు. పోనీ వేతనాలనైనా సంతృప్తికరంగా పెంచారా అంటే అదీ లేదు.
వైఎస్సార్సీపీ పాలనలో ద్యోగులు సతమతం : గతంలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులు గరిష్ఠంగా 43 శాతం ఫిట్‌మెంట్ తీసుకొంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 23 శాతంతో సరిపెట్టింది. వేతనాలు, హెచ్ఆర్ఏ సహా అలవెన్సుల్లోనూ కోత పెట్టింది. ఫలితంగా పెరగాల్సిన జీతం తగ్గింది. ఉద్యోగులు దాచుకున్న సొమ్మునూ వాడేసుకుంది. 2019 నాటి వేతన సవరణ బకాయిలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. విలీనానికి ముందు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు వచ్చేవి. కానీ వైఎస్సార్సీపీ పాలనలో జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఉద్యోగులు సతమతమయ్యారు.
జగన్ హయాంలో కష్టాల ఊబిలో ఆర్టీసీ - కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది! - YSRCP Govt Neglect RTC Buses
ప్పులపాలై రోడ్డున పడ్డ ఉద్యోగ కుటుంబాలు : ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమితంగా ఉన్న ఉచిత వైద్య సదుపాయాన్ని విలీనం తర్వాత జగన్ సర్కార్ ఎత్తేసింది. ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేసినా అవి ఎక్కడా పనిచేసిందిలేదు. దీని వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది డ్రైవర్లు, కండక్టర్ల ప్రాణాలు పోయాయి. ఐదేళ్లు డొక్కు బస్సులు, గుంతల రోడ్లపై వేల మంది డ్రైవర్లు, కండక్టర్ల ఒళ్లు గుల్లైంది. వైద్యం అందక అప్పులపాలై ఎన్నో ఉద్యోగ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
బదిలీలు చేసి వేతనాల్లో కోత : విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ జగన్ వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. కేడర్ స్ట్రెంత్ పేరిట ఉద్యోగులను అడ్డగోలుగా బదిలీలు చేసి వేతనాల్లో కోత పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అప్పటి సీఎం జగన్కు ఎన్నోసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు.
కొత్త ప్రభుత్వంపై గంపెడాశలు : కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. విలీనం తర్వాత ఏర్పడిన సమస్యలు పరిష్కరించి అక్రమ సస్పెన్షన్లు, వేధింపుల నుంచి తమను కాపాడాలని కోరుకుంటున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఈపీఎఫ్ అధిక పింఛను అందని ద్రాక్షేనా! - EPF Problem for RTC Employees