ETV Bharat / state

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో తప్పులు - ‘అతివాద దశ’ బదులుగా తీవ్రవాద దశ! - mistakes in APPSC Group 1 Exam

Mistakes in APPSC Group 1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేెలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. ఆంగ్ల పదాలను యథాతథంగా ముద్రించడం, మరి కొన్ని తెలుగు పదాలను తప్పుగా ముద్రించడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Mistakes in APPSC Group 1 Exam
Mistakes in APPSC Group 1 Exam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 7:33 AM IST

Mistakes in APPSC Group 1 Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. దీని వళ్ల తెలుగు మాధ్యమం అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదివేందుకు అభ్యర్థులు తమ సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సి వచ్చింది. కొన్ని సార్లు అనువాదం సరిగ్గా అర్థంకాక అయోమయానికి గురయ్యారు.

అభ్యర్థులకు అగ్ని పరీక్ష ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రశ్న పత్రంలో ముద్రణపరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి. మరోపక్క గ్రూప్-2 ప్రిలిమ్స్ మాదిరిగానే ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. కొన్ని ప్రశ్నలు సివిల్స్ కంటే సంక్లిష్టంగా ఉన్నాయని కొంత మంది అభ్యర్థులు తెలిపారు. ముఖ్యంగా 63 పేజీలతో ఉన్న పేపర్-1 ప్రశ్నపత్రం అభ్యర్థులకు అగ్ని పరీక్ష పెట్టింది. కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రశ్నలను అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనుకబడుతున్నారు. సుదీర్ఘ కాలంపాటు సన్నద్ధమైన వారు మాత్రమే ఈ పరీక్షలో త్వరగా జవాబులు గుర్తించగలిగారు. వర్తమాన అంశాలపై పట్టున్నవారు, పత్రికలు బాగా చదివిన వారు పోటీలో కాస్త ముందంజలో ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై ఆందోళన వద్దు: ఏపీపీఎస్సీ ఛైర్మన్​ గౌతమ్‌ సవాంగ్

‘అతివాద దశ’ బదులుగా, తీవ్రవాద: చరిత్ర విభాగానికి సంబంధించి బి సిరీస్​లో 22వ ప్రశ్నలో ఆంగ్లం నుంచి తెలుగులోనికి ‘అతివాద దశ’ అని పేర్కొనడానికి బదులుగా, తీవ్రవాద దశగా అనువాదం చేసి వచ్చింది. పేపరు 2లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో సి సిరీస్‌లోని 66వ ప్రశ్నలో శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించిన ‘కొత్త’ (నావెల్‌) పరికరం ద్వారా నిర్థారణ పరీక్షలు అన్న ప్రశ్నకు సంబంధించి, తెలుగు అనువాదంలో నవల అని ముద్రించి వచ్చింది. దీని వల్ల ఆ ప్రశ్న అర్థమే పూర్తిగా మారిపోయింది. ఇక 71వ ప్రశ్నలో విపత్తు అనే పదాన్ని ఇవ్వకుండా, ఆంగ్ల పదాన్ని అలాగే ముద్రించారు.

109వ ప్రశ్నలో కోస్ట్‌గార్డ్‌ సైనిక విన్యాసాలు అని ఇవ్వకుండా కోస్ట్‌గార్డ్‌ వ్యాయామమని వచ్చింది. 89వ ప్రశ్నలో జీవవిచ్చిన్నం అనే పదాన్నికి బదులుగా ఆంగ్లంలోనే స్మార్ట్‌ బయోడిగ్రేడబుల్‌ యథాతథంగా ఇచ్చారు. 90వ ప్రశ్నలో గుండ్రటి రూపం పదానికి బదులు ఆంగ్లంలోని రింగ్‌ అనే పదాన్ని తెలుగులోనూ అలాగే ముద్రించారు. అలాగే మరో ప్రశ్నలో తెలుగులో భ్రూణం అని ముద్రించాల్సి ఉండగా పిండం అని ముద్రించారు. ఇలా అనేక ఆంగ్ల పదాలను యథాతథంగా ముద్రించడం, మరి కొన్ని తెలుగు పదాలను తప్పుగా ముద్రించడంతో తెలుగు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ముగిసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ - ఒంగోలులో కాపీ చేస్తూ పట్టుబడిన అభ్యర్థి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.