Trains Cancel In AP: విజయవాడ, ఖాజీపేట సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తంగా రద్దు : 07755/07756 విజయవాడ-డోర్నకల్ రైలును ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 9వరకు, 07979/07278 విజయవాడ-భద్రాచలం ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 9వరకు, 12705/12706 గుంటూరు-సికింద్రాబాద్ ఈ నెల 28,29,జనవరి 2, 5, 8, 9 తేదీలలో, 12713/12714 విజయవాడ-సికింద్రాబాద్ లో డిసెంబర్ 27 జనవరి 1, 4, 7, 8, 9 తేదీలలో , 22645/22646 కొచువెల్లి-ఇందౌర్ 28, 30 న జనవరి 4, 6 న, 22647/ 22648 కొచువెల్లి-కోబ్రా 26, 28, 30 జనవరి 1, 2, 6, 8 తేదీల్లో, 12511/12512 గోరఖర్‌పూర్-కొచువెల్లి ఈ నెల 26, 31 జనవరి 5, 8 తేదీల్లో, 12521/12522 ఎర్నాకుళం-బరౌని ఈ నెల 27, 30 జనవరి 3, 6, 10 తేదీల్లో, 01927/01928 కాన్పూర్-మధురై ఈ నెల 25, 27 జనవరి 3, 8, 10 తేదీల్లో , 02121/02122 జబల్పూర్-మధురై ఈ నెల 26, 28 తేదీల్లో, 03325/03326 ధన్‌బాద్-కోయంబత్తూర్ ఈ నెల 25, 28, జనవరి 1, 4 తేదీల్లో రద్దు అయ్యాయి.
పాక్షిక రద్దు (గుంటూరు, కాజీపేట ): 17201/17202 గుంటూరు, సికింద్రాబాద్ ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 9వరకు పాక్షికంగా రద్దు అయ్యాయి.
దారి మళ్లింపు (వయా విజయవాడ, గుంటూరు, పగిడపల్లి వైపుగా)
18519 విశాఖపట్నం-ముంబయి ఎల్‌టీటీ ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 8వరకు, 17205/17206 సాయినగర్ శిర్డీ, కాకినాడ పోర్ట్ జనవరి 7,8 తేదీల్లో, 17207/17208 మచిలీపట్నం-సాయినగర్ శిర్డీ (జనవరి 7,8 తేదీల్లో), 11019/11020 భువనేశ్వర్-ముంబయి(జనవరి 6వ తేదీ నుంచి 8వరకు), 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ (జనవరి 8,9 తేదీల్లో), 12644 హజ్రత్‌నిజాముద్దీన్- త్రివేండ్రం (ఈ నెల 27), 12642 హజ్రత్‌నిజాముద్దీన్-కన్యాకుమారి (ఈ నెల 28, జనవరి 4,6 తేదీల్లో), 12646 హజ్రత్‌నిజాముద్దీన్-ఎర్నాకుళం(జనవరి 7), 03259/03260 ధనాపూర్-బెంగళూరు (జనవరి 2, 7 తేదీల్లో), 03241/03242 ధనాపూర్-బెంగళూరు (జనవరి 3, 5 తేదీల్లో), 03247/03248 ధనాపూర్-బెంగళూరు రైళ్లు జనవరి 2, 4 న దారి మళ్లింపు జరుగుతుంది.
ప్రయాణికులకు అలర్ట్- ఆ మార్గంలో ఆగస్టు 10 వరకు 24 రైళ్లు రద్దు - Cancellation of 24 Trains in AP
47 రోజులపాటు ఆ మూడు రైళ్లు రద్దు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు - trains cancelled