ETV Bharat / state

ఏబీవీకి మద్దతుగా 87 దేశాల నుంచి సంతకాల సేకరణ - ప్రభుత్వంపై ఏపీ టుమారో సంస్థ ఆగ్రహం - campaign for AB Venkateswara Rao

Signature Campaign for AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏపీ టుమారో సంస్థ చేస్తున్న సంతకాల సేకరణకు అశేష స్పందన లభించిందని సంస్థ అధ్యక్షుడు చక్రవర్తి అన్నారు. క్యాట్ ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఉద్దేశ్యపూర్వకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకు 87 దేశాల నుంచి సంతకాలు సేకరించామన్నారు. సంతకాల సేకరణ నివేదికను ఈసీకి పంపామని తెలిపారు.

Campaign for AB Venkateswara Rao
Campaign for AB Venkateswara Rao (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 10:14 PM IST

Signature Campaign for AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏపీ టుమారో సంస్థ చేస్తున్న సంతకాల సేకరణకు అశేష స్పందన లభించిందని ఆ సంస్థ అధ్యక్షుడు చక్రవర్తి అన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఏబీవీ సస్పెన్షన్​ను తప్పు బట్టిందని గుర్తు చేశారు. రెండో సారి సస్పెన్షన్ చేయటం నిబంధనలకు విరుద్ధమంటూ క్యాట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకు 87 దేశాల నుంచి 35 వేల మందికి పైగా సంతకాల సేకరణకు మద్దతు తెలిపారన్నారు. సంతకాల సేకరణ నివేదికను ఈసీకి పంపామన్నారు. త్వరలో వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు.

ఏబీవీకి మద్దతుగా 87 దేశాల నుంచి సంతకాల సేకరణ - ప్రభుత్వంపై ఏపీ టుమారో సంస్థ ఆగ్రహం (ETV Bharat)

ప్రభుత్వమే పగబడితే ఎలా?!- ఐపీఎస్​ ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా వేధింపులు - AB Venkateswara Rao Posting

AB Venkateswara Rao suspension Issue: కాగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు నిలిపివేత పిటిషన్‌పై ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరిగింది. ఏబీ వెంకటేశ్వరరావుని రెండో సారి సస్పెండ్‌ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ నెల 8వ తేదీన క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.

క్యాట్‌ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎస్: గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విచారణ జరిపిన క్యాట్‌ ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్‌ చేయడం చెల్లదని స్పష్టం చేసింది. సస్పెన్షన్​ను ఎత్తివేస్తూ తక్షణం బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు సైతం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది. ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్యాట్‌ తీర్పు మింగుడుపడకపోవడంతో, అనంతరం హైకోర్టులో వ్యాజ్యం వేసింది.

పోస్టింగ్​లోనే కాదు - ఓటు హక్కు కల్పించడంలోనూ కక్ష సాధింపే - AB Venkateswara Rao vote issue

సీఎస్‌ వేసిన పిటిషన్​లో ఆయన తరఫున సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ కార్యదర్శి జి జయరాం అఫిడవిట్‌ దాఖలు చేశారు. సస్పెన్షన్​ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో క్యాట్‌ పొరపాటు పడిందని జయరాం అఫిడవిట్​లో తెలిపారు. సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయన్న విషయాన్ని క్యాట్‌ పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కట్టుబడి వ్యవహరించడంలో క్యాట్‌ విఫలమైందని అన్నారు. క్యాట్‌ ఉత్తర్వులు హేతుబద్ధంగా లేవన్నారు.

మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏపీ టుమారో సంస్థ చేపట్టిన సంతకాల సేకరణ చేపట్టింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పోస్టింగ్​ను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 87 దేశాల నుంచి సంతకాలు సేకరించి, ఆ నివేదికను ఈసీకి పంపామని ఏపీ టుమారో సంస్థ అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు.

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొట్టివేసిన క్యాట్ - వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశం - IPS AB Venkateswara Rao

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.