ETV Bharat / state

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - మీకు నచ్చిన మీడియం ఎంచుకోవచ్చు - AP TENTH CLASS EXAMS IN TELUGU

పదో తరగతి విద్యార్థులకు తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలలో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం

AP_Tenth_Class_Exams
AP Tenth Class Exams in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 8:16 AM IST

AP Tenth Class Exams in Telugu: పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలలో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో మీడియంని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఆప్షన్​ను మార్చుకోవచ్చని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వారిని ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020-21లో ఆదేశాలిచ్చింది. అయితే ఇంగ్లిష్‌ మీడియం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ‘ఇంగ్లిష్‌ మీడియం’ అని వాడకుండా ‘ఒకే మీడియం’ ఉండాలని ఆదేశించారు.

అంటే అనధికారికంగా ఇంగ్లిష్‌ మీడియమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మీడియం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మీడియం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలను కొనసాగించారు. ఇలా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది.

రికార్డుల్లోనే ఇంగ్లిష్ మీడియం: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదోతరగతి చదువుతున్న వారు 6.20 లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌లో 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39 వేలకుపైగా విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం అమలవుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో తరగతులు, బోధనను పట్టించుకోకుండా ఒకే మీడియం అంటూ పేర్కొంది.

విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలాచోట్ల తెలుగులోనే పాఠాలు చెప్పగా, విద్యార్థులు మాతృభాషలోనే చదువుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో విద్యార్థులు ఎలా రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్పు చేయడంతో వీరు అభ్యసనకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బ్యాచ్‌ విద్యార్థులు పదో తరగతికి రావడంతో ఇంగ్లిష్​లో చదివి, ఇంగ్లిష్​లో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.

SSC విద్యార్థులు అలర్ట్​ - పరీక్ష ఫీజు చివరి తేదీ ఎప్పుడంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.