Employees Bifurcation Issue: ఏపీ నుంచి తెలంగాణకు, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల కమిటీ సమీక్షిస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ల కమిటీ పరిశీలన చేస్తోందని శాసనసభకు తెలిపారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి, శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు 1942 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. అలాగే 1447 మంది తెలంగాణ నుంచి ఏపీకి రావాలని అక్కడ దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. అంతర్రాష్ట్ర బదిలీల కోసం తెలంగాణకు ఇప్పటికే లేఖ రాశామని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉందని వివరించారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులను 182 మందిని రిలీవ్ చేస్తూ ఆదేశాలు కూడా ప్రభుత్వం జారీ చేసిందని, ఇప్పటికే 61 మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారని అన్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పునర్వవస్థీకరణ అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపామని తదుపరి అధికారులు కమిటీ, మంత్రుల కమిటీలు చర్చలు చేస్తాయని స్పష్టం చేశారు. అంతకుముందు దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే కూన రవికుమార్, రాష్ట్ర విభజన తర్వాత మూడు సార్లు తెలంగాణకు ఉద్యోగులను బదిలీ చేశారని, ఇప్పటి వరకూ తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను మాత్రమే ఆ రాష్ట్రం తీసుకుంటోందని అన్నారు. కేవలం రిజర్వేషన్ల కోసమే దరఖాస్తులు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
5 బిల్లులను ఆమోదం - శాసనమండలి బుధవారానికి వాయిదా
ఇవిగో 'అరబిందో' అక్రమాలు - అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టిన సోమిరెడ్డి