ETV Bharat / state

ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు - ప్రచారానికి సిద్ధమైన జగన్, చంద్రబాబు - Political Heat in AP - POLITICAL HEAT IN AP

Political Heat in AP: సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసిన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

jagan chandrababu campaign
jagan chandrababu campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 12:08 PM IST

Political Heat in AP : ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.

ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. బుధవారం నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలు పెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది.

18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన - Janasena Candidates for 18 Seats

జగన్ షెడ్యూల్ ఇదీ : ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ బుధవారం నుంచి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహించనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకూ కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభనున్నారు. మెుదటి రోజు బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు.

28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.

ఏపీ బీజేపీ లోక్​సభ అభ్యర్థులు వీరే - 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా విడుదల చేసిన అధిష్ఠానం - bjp Andhra Lok Sabha Candidates

చంద్రబాబు ప్రచారం ఇలా : మార్చి 27 నుంచి మార్చి 31 వరకూ చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్‌ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ, మంగళవారం మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.