ETV Bharat / state

సొంతూళ్లకు పయనమైన ఏపీ ఓటర్లు- ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు - Passengers PROBLEMS DUE TO NO BUSES - PASSENGERS PROBLEMS DUE TO NO BUSES

Passengers Facing Difficulties Due to Lack of Buses: హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు ఏపీ ఓటర్లు పయనమవటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీకి సరిపడా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు అదనపు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Passengers_Facing_Difficulties_Due_to_Lack_of_Buses
Passengers_Facing_Difficulties_Due_to_Lack_of_Buses (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 7:31 PM IST

సొంతూళ్లకు పయనమైన ఏపీ ఓటర్లు- ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (ETV Bharat)

Passengers Facing Difficulties Due to Lack of Buses: ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్​లో ఉన్న ఏపీకి చెందిన వివిధ ప్రాంతాల వారు పయనమవ్వడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆంధ్రా ఓటర్లు హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు బస్సు, రైలు రిజర్వేషన్లు చేసుకునేందుకు సీట్లు ఖాళీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులు, రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి.

కూటమి అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ - తప్పనున్న జగన్‌ ఛార్జీల బాదుడు - FREE BUS SCHEME TO WOMEN

ఓటర్ల కోసం రద్దీకి సరిపడా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయలేదు. రోజూ 114 బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తుండగా ఇవాళ కేవలం 120 బస్సులు మాత్రమే ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. అన్ని బస్సుల్లోనూ ఒక్క సీటు కూడా ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు బస్సు ఛార్జీలను భారీగా పెంచారు. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు అదనపు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.