ETV Bharat / state

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు- జెండా ఆవిష్కరించిన గవర్నర్ - గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

AP Govt Republic Day Celebrations at Indira Gandhi Municipal Stadium: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్​, ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి పాల్గొని దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులకు నివాళులర్పించారు.

AP_Govt_Republic_Day_Celebrations_at_Indira_Gandhi_Municipal_Stadium

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 12:48 PM IST

Updated : Jan 26, 2024, 2:05 PM IST

YSRCP Suspends Five Leaders in Addanki Constituency:

AP Govt Republic Day Celebrations at Indira Gandhi Municipal Stadium: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులకు నివాళులర్పించారు. సాయుధ దళాలు గవర్నర్‌కు గౌరవ వందనం చేశారు. స్టేడియంలో పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్​సీసీ దళాలు కవాతు చేపట్టారు.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు: రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. స్టేడియంలో వివిధ శకటాల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల శకటాలతో పాటు ఎన్నికల నిర్వహణపైనా శకటం ప్రదర్శించారు. ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని గవర్నర్‌ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గవర్నర్ కొనియాడారు. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా పారదర్శకంగా పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.

భారత్​కు ప్రపంచ దేశాల రిపబ్లిక్ డే శుభాకాంక్షలు- రష్యా స్పెషల్ విషెస్!

"సవాళ్లను అధిగమించేందుకు మనందరి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజల సహకారంతో వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిబింబించేలా గత వారం 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు అమలు చేశాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా సర్కారు పని చేస్తోంది. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నాం. మారుమూల గ్రామాలకు సంక్షేమ, అభివృద్ధిని అందిస్తున్నాం." - జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్

ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు: మరోవైపు ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి సచివాలయం ఒకటో బ్లాక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఏపీ శాసన మండలి, శాసన సభ ప్రాంగణంలో మండలి ఛైర్మన్ మోషన్ రాజు, స్పీకర్ తమ్మినేని జాతీయ జెండా ఆవిష్కరించారు. చిన్నారులకు స్వీట్లు పంచారు. రాజ్యంగ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో రిపబ్లిక్​ డే సెలబ్రేషన్స్: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తాతో పాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే వేడుకల వేళ సైన్యం అలర్ట్​- AI టెక్నాలజీతో సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత

Last Updated : Jan 26, 2024, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.