ETV Bharat / state

"జేసీకి తప్పుడు నివేదికలు" - ఆ జిల్లాలో భూఅక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన భూఅక్రమాలపై విచారణ - విజయనగరం మాజీ ఆర్డీవో భవానీశంకర్ అక్రమాలపై విచారణకు ఆదేశం

Govt_Enquiry_on_Vizianagaram_Lands
Govt Enquiry on Vizianagaram Lands (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Govt Enquiry on Vizianagaram Lands : గత వైఎస్సార్సీపీ హయాంలో విజయనగరం జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో విజయనగరం మాజీ ఆర్డీఓ బి.హెచ్. భవానీ శంకర్ అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. భవానీ శంకర్​తో పాటు మరో నలుగురు తహసీల్దారులపైనా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి భోగాపురం తహసీల్దారు రమణమ్మ, కొత్తవలస తహసీల్దారు సురేష్, పూసపాటిరేగ తహసీల్దారు విజయభాస్కర్, జామీ మండల తహసీల్దారు నీలకంఠ రావు ప్రభుత్వ భూములను కాపాడటంలో విఫలమయ్యారని గుర్తించారు.

జాయింట్ కలెక్టర్​కి తప్పుడు నివేదిక ఇచ్చి ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పరోక్షంగా సహకరించారని అభియోగాలు ఉన్నాయి. విజయనగరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్​ను ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఈ అక్రమాలపై సమగ్ర సమాచారాన్ని ఎంక్వైరీ అధికారికి అందించాలని విజయనగరం డీఆర్వో శ్రీనివాసమూర్తిని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఆరు వారాలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

జగనన్న కాలనీల భూసేకరణలో భారీ దోపిడీ! రూ. 1500 కోట్లకుపైగానే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.