ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​లో తాగు నీటి కష్టాలకు చెక్ - శరవేగంగా పైప్‌లైన్, పంప్‌హౌస్ పనులు - WATER ISSUE AIIMS MANGALAGIRI

మంగళగిరి ఎయిమ్స్‌కు తీరనున్న నీటి కష్టాలు

Drinking Water Problem In AIIMS Mangalagiri
Drinking Water Problem In AIIMS Mangalagiri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 11:58 AM IST

Drinking Water Problem in AIIMS Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్‌కు నీటి సమస్య అతి త్వరలో తీరనుంది. ఆసుపత్రికి నీటి సరఫరా చేసే పైప్‌లైన్, పంప్‌హౌస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఎయిమ్స్ అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే పెండింగ్ బిల్లులు చెల్లించటంతో పాటు పనులు మళ్లీ ప్రారంభించారు. నవంబర్ నెలఖారుకు నీరివ్వాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎయిమ్స్ ఒకటి. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే మంగళగిరిలోని ఎయిమ్స్‌కు నీటి సరఫరా విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీస సహకారం అందించలేదు. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి. కూటమి ప్రభుత్వం రాగానే ఎయిమ్స్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. సమస్యను వివరించారు. తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

నవంబర్​లో పూర్తికానున్న పనులు : సీఎం చంద్రబాబు చొరవతో రెండో దశ అనుమతులు వచ్చాయి. గుత్తేదార్లకు పెండింగ్ బిల్లులు చెల్లించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలాఖరుకు నీరందించాలన్న లక్ష్యంతో ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం పనులు చేస్తోంది. నిత్యం వెయ్యిమందికి పైగా రోగులు వస్తున్న ఎయిమ్స్‌లో నీటి సమస్య వల్ల సేవలకు అంతరాయాలు కలుగుతున్నాయి. అందుకే నీటి సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటిదాకా రూ.5.48 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 85 శాతం పనులు పూర్తయాయని మిగిలిన 15 శాతం పనులు నవంబర్​లో చేస్తామని అధికారులు చెబుతున్నారు.

"ఆత్మకూరు చెరువులోకి నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎయిమ్స్ ఆసుపత్రికి తాగు నీటి పనులు సాగుతున్నాయి. గత ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్లాంట్​ను సిద్ధం చేస్తోంది. నవంబర్ నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి." - స్థానికులు

గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి గ్రావిటీపై పైపులైను ద్వారా అందించేందుకు పనులు చేస్తున్నారు. త్వరలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఇది విజయవంతం కాగానే పైపులైన్ సామర్థ్యాన్ని పరిక్షిస్తారు. ఇబ్బందులేమీ లేవని నిర్ధారించుకున్నాకే సంపులో నీళ్లు నిల్వ చేస్తామని అధికారులు తెలిపారు. పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య కారణంగా ఎయిమ్స్‌లో ఇంకా పూర్తిస్థాయిలో అన్ని విభాగాలు ఏర్పాటు కాలేదు. అలాగే 900 బెడ్ల సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 600 పడకలతోనే నిర్వహిస్తున్నారు. నీటి సమస్య తీరితే ఆసుపత్రిలో పడకల సంఖ్య పెరగనుందని అధికారులు పేర్కొన్నారు.

మంగళగిరి ఎయిమ్స్​లో మెరుగైన వైద్య సేవలు ​- అతి తక్కువ ఖర్చుతో చికిత్స - Mangalagiri AIIMS

పేదలకు అండగా ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్​- ఉచిత వైద్యం కోసం అప్లై చేసుకోండిలా! - AB PM JAY Yojana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.