ETV Bharat / state

ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం - మొత్తం 12 శాఖల్లో ట్రాన్స్​ఫర్స్​ - AP Govt Approves Transfers - AP GOVT APPROVES TRANSFERS

AP Government Approves Transfers of Employees : ఉద్యోగుల ట్రాన్స్​ఫర్స్​కు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసింది.

AP Govt Approves Transfers of Employees
AP Government Approves Transfers of Employees (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 4:19 PM IST

Updated : Aug 17, 2024, 7:00 PM IST

AP Government Approves Transfers of Employees : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు వచ్చాయి. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఈనెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అనుమతించింది.

రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులుకు బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వారికి మాత్రం బదిలీల వర్తించవు : గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీల వర్తింపజేశారు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు , వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్యభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్‌ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేశారు. ఆఫీస్‌ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయించారు. తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్‌ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించారు. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. పరిశీలన తర్వాత కూడా పరిపాలన పరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియక పోయినా ఆఫీస్‌ బేరర్లను బదిలీలు చేయొచ్చని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఏపీ సీఎం - పేదలతో కలిసి చంద్రబాబు దంపతుల భోజనం - AP CM Inaugurated Anna Canteen

పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టినా పద్ధతి మారలే -కూటమి సర్కార్‌పై వెయిటింగ్​ ఐపీఎస్​ల కుట్రలు! - Memos Issue to IPS Issue IN AP

Last Updated : Aug 17, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.