ETV Bharat / state

రాష్ట్రంలో ముగిసిన పోలింగ్​ - క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం - AP Election Polling Completed - AP ELECTION POLLING COMPLETED

AP Election Polling Completed: ఆంధ్రప్రదేశ్​లో పోలింగ్​ ముగిసింది. ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి కాగా 169 నియోజకవర్గాల్లో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరగగా, అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.

AP Election Polling Completed
AP Election Polling Completed (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 5:48 PM IST

Updated : May 13, 2024, 8:03 PM IST

AP Election Polling Completed: ఏపీలో పోలింగ్​ ముగిసింది. రాష్ట్రం ఓటెత్తింది. ఎండ వేడిమిని లెక్కచేయకుండా పలు చోట్ల దాడులకు వెరవకుండా ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేశారు. 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసినా క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ జోరుగా సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి వేచి చూసి మరి ఓటు వేశారు. సాయంత్ర 5 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 67.99 శాతం పోలింగ్ నమోదైంది.

ఆ ప్రాంతాల్లో తిరిగి పోలింగ్ నిర్వహించాలి - ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు - TDP leaders complained to EC

విశాఖ లోక్‌సభ పరిధిలో సాయంత్రం 5 గంటర వరకు 59.39శాతం, అనకాపల్లి లోక్‌సభ పరిధిలో 64.14, విజయనగరం లోక్‌సభ పరిధిలో 67.74శాతం, శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో 67.10శాతం, అరకు లోక్‌సభ పరిధిలో58.20శాతం ఓటింగ్‌ నమోదైంది. అమలాపురం లోక్‌సభ పరిధిలో 73.55శాతం, రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో 67.93, కాకినాడ లోక్‌సభ పరిధిలో 65.01 శాతం, నరసాపురం లోక్‌సభ పరిధిలో 68.9 8శాతం, ఏలూరు లోక్‌సభ పరిధిలో 71.10శాతం ఓట్లు పోలయ్యాయి. మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో 73.53శాతం, విజయవాడ లోక్‌సభ పరిధిలో 67.44 శాతం నమోదైంది.

గుంటూరు లోక్‌సభ పరిధిలో 65.58, నరసరావుపేట లోక్‌సభ పరిధిలో 69.10 బాపట్ల లోక్‌సభ పరిధిలో 72.57, నెల్లూరు లోక్‌సభ పరిధిలో 69.55, ఒంగోలు లోక్‌సభ పరిధిలో 70.44 శాతం పోలింగ్‌ నమోదైంది. అనంతపురం లోక్‌సభ పరిధిలో 67.71శాతం, హిందూపురం లోక్‌సభ పరిధిలో 66.89, కడప లోక్‌సభ పరిధిలో 72.85, కర్నూలు లోక్‌సభ పరిధిలో 64.08, నంద్యాల లోక్‌సభ పరిధిలో 70.58 రాజంపేట లోక్‌సభ పరిధిలో 68.47, తిరుపతి లోక్‌సభ పరిధిలో 65.91 చిత్తూరు లోక్‌సభ పరిధిలో 75.60 మంది ఓటు వేశారు.

ఓ వైపు ఎన్నికలు జరుగుతుంటే ఐవీఆర్ కాల్స్‌తో జగన్​ ప్రచారం - Kambhampati on Polling in AP

జిల్లాల వారీగా చూస్తే అనంతపురం జిల్లాలో సాయంత్రం 5 వరకు 68.04, చిత్తూరు జిల్లాలో 74.06, తూర్పుగోదావరి జిల్లాలో 67.93, ఏలూరు జిల్లాలో 71.10, గుంటూరు జిల్లాలో 65.58శాతం, కృష్ణా జిల్లాలో 73.53శాతం, కర్నూలు జిల్లాలో 64.55శాతం, నంద్యాల జిల్లాలో 71.43శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 67.44 శాతం, పల్నాడు జిల్లాలో 69.10శాతం, ప్రకాశం జిల్లాలో 71శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 67.48శాతం, విశాఖ జిల్లాలో 57.42 శాతం, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 72.85 శాతం ఓట్లు పోలయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్‌ సమయం ముగిసినా ఇప్పటికీ ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇప్పటికీ అనేక పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అనేక కేంద్రాల్లో రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగనుంది. గ్రామీణంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పోలింగ్ నమోదవుతోంది.

టీడీపీ Vs వైఎస్సార్సీపీ - రణరంగంగా మారిన కడప జిల్లా - tdp ysrcp clashes in ysr kadapa

ఆరు నియోజకవర్గాల్లో ముందే ముగిసిన పోలింగ్: అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటలకే ముగిసింది. అదే విధంగా పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5కి పోలింగ్ పూర్తైంది. సాయంత్రం 5 గంటల వరకు 67.99 పోలింగ్​ శాతం నమోదయ్యింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ సమయం ముగిసింది. నాలుగు గంటల వరకు సమయం ముగియడంతో దాదాపు 80 శాతం పోలింగ్ ముగించారు. ఓటర్లు క్యూలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కంటిన్యూ చేస్తున్నారు.

మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ వర్షం కురవడంతో పాడేరు ప్రధాన పట్నంలో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తగ్గుముఖం పట్టారు. లాస్ట్ చివరి నిమిషంలో వర్షంలో తడుస్తూ కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల పోలింగ్ దాదాపు పూర్తి చేశారు. మూడు గంటల వరకు జిల్లాలో అరకు నియోజకవర్గం 51.8, పాడేరు 40.12, రంపచోడవరం 44.11 శాతం నమోదయింది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

కుప్పంలో వైఎస్సార్సీపీ అరాచకం - పోలింగ్​ బూత్​ తలుపులు మూసిన భరత్ - YSRCP Attack on TDP Agents

Last Updated : May 13, 2024, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.