AP EAPCET APPLICATIONS 2024 :ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ 2024కు దరఖాస్తులు టాప్‌గేర్‌లో వస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు విభాగాలకు కలిపి దాదాపు మూడు లక్షల 90వేల మంది విద్యార్ధులు దరఖాస్తులు సమర్పించారు. ఇంటర్మిడియట్ ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలు వెల్లడికావటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చిన వాటిల్లో ఇంజనీరింగ్ విభాగానికి అత్యధికంగా 2,89,981 మంది అప్లై చేశారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో కలిపి మరో 90వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు 50వేల అప్లికేషన్స్ అదనంగా వచ్చాయి.AP EAPCET 2023కి మొత్తం 3, 38,739 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్షకు 2, 24, 724మంది పరీక్షలకు హాజరయ్యారు. వ్యవసాయ విభాగానికి సంబంధించిన పరీక్షకు 90, 573 మంది విద్యార్ధులు హాజరుయ్యారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చూసుకోండిలా
apply here: AP EAPCET పరీక్ష రాయాలనుకునే విద్యార్ధులు JNTU-కాకినాడ సులభమైన విధానాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అప్లికేషన్స్‌ను https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ సూచనలు, సలహాలను సమగ్రంగా అధ్యాయనం చేయాలి. అటు తర్వాతే అప్లికేషన్ ఫామ్‌ను క్రమ పద్దతిలో నింపాలి. అప్లికేషన్ నింపడానికి ముందే అన్ని రకాల దృవపత్రాలను స్కాన్ చేసి PDF రూపంలో సిస్టమ్‌లో పొందుపరుచుకోవటం ఉత్తమం. పొరపాట్లకు ఆస్కారం లేకుండా దరఖాస్తులను సమ్మిట్ చేయాలని JNTU-కాకినాడ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.1,000 అపరాద రుసంతో మే 5 వరకు, రూ.5 వేల ఫైన్‌తో మే 10 వరకు, రూ.10 రుసంతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పుల సవరణలకు మే 4 నుంచి 6 వరకు అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లను మే 7 నాటికి https://cets.apsche.ap.gov.in/ ఈ వెబ్‌సైట్ ద్వారా విద్యార్ధులకు అందుబాటులో ఉంచనున్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలు బిగ్ అప్‌డేట్- అన్నీ అనుకూలిస్తే 25నే రిజల్ట్స్
పరీక్ష తేదీలు: ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు మే 16 మొదటి పరీక్ష నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను మే 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగంలో మే 18 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలన్నీ కూడా ఉదయం, సాయంత్రం జరుగుతాయి. ఉదయం 9గంటలకు ప్రాంరభమై 12 కు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు.
READ MORE: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చూసుకోండిలా
పదో తరగతి పరీక్ష ఫలితాలు బిగ్ అప్‌డేట్- అన్నీ అనుకూలిస్తే 25నే రిజల్ట్స్