ETV Bharat / state

డిప్యూటీ సీఎంకు మహిళల ఫిర్యాదు - ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని ఆవేదన - pawan kalyan review meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 9:11 AM IST

Pawan Kalyan Review Meeting: పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తోన్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. వైఎస్సార్సీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో లెక్కలు చూస్తుంటే తెలుస్తోందని విమర్శించారు.

Pawan Kalyan Review Meeting
Pawan Kalyan Review Meeting (ETV Bharat)

Pawan Kalyan Review Meeting: డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ అన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైఎస్సార్సీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని విమర్శించారు. పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​కు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావలసిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. కచ్చితంగా వారికి న్యాయం చేస్తానని ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి: విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పీఆర్ అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బంక్ (ఏఐఐబీ) నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై పవన్‌ అధికారులతో చర్చించారు.

జల్​జీవన్ మిషన్ గ్రాంట్ వివరాలివ్వండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - Pawan Kalyan Review

నిధులు ఏ మేరకు వినియోగించారు: ప్రధానంగా కేంద్రం అమలు చేసే పీఎంజీఎస్​వై (Pradhan Mantri Gram Sadak Yojana), ఆర్​సీపీడబ్ల్యూఈ, ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాల ద్వారా వచ్చిన నిధులు ఏ మేరకు వినియోగించారో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్​లో ఉన్న పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారులు ఏ మేరకు దెబ్బతిన్నాయో, ఎంత కాలం నుంచి మరమ్మతులు చేయడం లేదో చెబుతూ, రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారా: ఏఐఐబీ నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రీ ఎంబర్స్ చేస్తామని ఏఐఐబీ చెప్పిందని తెలిసి పవన్ కల్యాణ్​ ఆశ్చర్యపోయారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారా లేదా అని ప్రశ్నించారు.

బ్లాక్ లిస్టులో ఉన్నవారికి ఏ విధంగా పనులు అప్పగిస్తున్నారు, ఆ జాబితాలో ఉన్నవారికి బిల్లులు చెల్లింపులు ఎలా చేశారో తెలుపుతూ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు పరిశీలనకు క్వాలిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ నిధులతో ఏ ప్రాంతంలో ఏ పని చేస్తున్నామో, అందుకు సంబంధించి అనుసరించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, బడ్జెట్ వివరాలు ప్రజలకు తెలియచేలా బోర్డులు పెట్టాలనే నిబంధన ఉన్నా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.

తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై దృష్టి పెట్టాలి - ఎమ్మెల్యేలకు పవన్​ కల్యాణ్​ దిశానిర్దేశం - Pawan Kalyan Meet in JSP MLAs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.