AP CS Jawahar Reddy Meets Chandrababu : తెలుగుదేశం అధినేత చంద్రబాబుని సీఎస్ జవహర్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి జవహర్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు.
గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేశినేని చిన్ని, బొండా ఉమా, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. డోలా బాలవీరాంజనేయ స్వామి, ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు వచ్చారు.
'మీ గెలుపే మా పొగరు' - అంతులేని ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న మెగాహీరో - AP Elections 2024