ETV Bharat / state

వైఎస్సార్సీపీ పాలనలో వేలకోట్ల మద్యం కుంభకోణం - AP CID Raids in Beverages Vasudeva Reddy House

Liquor Scam in Andhra Pradesh : దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు మించి ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందన్న చర్చ ప్రస్తుతం విస్తృతంగా నడుస్తోంది. గత ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు సూత్రధారులుగా మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటినీ గుత్తాధిపత్యంలో పెట్టుకుని భారీగా దోచుకున్నారన్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైఎస్సార్సీపీకి కరడుగట్టిన మద్దతుదారులైన అధికారులను పాత్రధారులుగా మార్చుకుని ఈ వ్యవస్థీకృత దందా సాగించారని చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారమార్పిడి జరుగుతున్న వేళ ఈ కుంభకోణంపై తెలుగుదేశం దృష్టిసారించింది.

liquor_scam_in_andhra_pradesh
liquor_scam_in_andhra_pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 9:39 AM IST

వైఎస్సార్సీపీ పాలనలో వేలకోట్ల మద్యం కుంభకోణం (ETV Bharat)

Liquor Scam in Andhra Pradesh : వైఎస్సార్సీపీ నాయకులు కుట్రదారులుగా రూపొందించిన నేర విధానాన్ని అన్నీ తానై అమలు చేశారనే అభియోగాలున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ శుక్రవారం కేసు నమోదు చేయడంతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. దీంతో ఆయనతో పాటు కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఇతర అధికారుల పాత్రపై టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారు భారీగా వెనకేసుకున్నారని తెలుస్తోంది. సూత్రధారుల్ని, పాత్రధారుల్ని పట్టుకునేలా ఈ కుంభకోణంపై విచారణను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

AP Beverages Corporation Vasudeva Reddy : వైఎస్సార్సీపీ పాలనలో మద్యం పేరుతో అందినకాడికి దోచేశారన్నది తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు మద్యం విధానంలో కొనసాగించిన దోపిడీకి వాసుదేవరెడ్డే కళ్లు, చెవులు సహా అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులున్నాయి. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టగానే ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్‌ కమిషనర్‌గా ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని నియమించుకున్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగి వైఎస్సార్సీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారుచేసే ‘జే బ్రాండ్లు’ మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఈయనేనని టీడీపీ గుర్తించింది.

AP CID Raids in Beverages Ex MD Vasudeva Reddy House : ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు 200 నుంచి 250 రూపాయలు చొప్పున, ప్రతి బీరు కేసుకు 100 నుంచి 150 రూపాయల చొప్పున కమీషన్‌ చెల్లించిన మద్యం కంపెనీలకే 99శాతం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి. ఏ మద్యం కంపెనీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇవ్వాలి? ఏయే బ్రాండ్లకు అనుమతులివ్వాలి? ఇలా ప్రతి అంశంపై సీఎంఓలోని కీలక అధికారి ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులకు అనుచిత లబ్ధి కలిగించారనేది ఈయనపై ప్రధాన ఆరోపణ. రమేష్‌రెడ్డి, కరీముల్లా, సురేష్‌రెడ్డి అనే ఉద్యోగుల్ని తనతోపాటు రైల్వే నుంచి డిప్యుటేషన్‌పై ఏపీఎస్‌బీసీఎల్‌(APSBCL)కు తీసుకొచ్చిన వాసుదేవరెడ్డి వారిని ఈ దందాలో కీలకంగా మార్చారన్న ఫిర్యాదులున్నాయి.

ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించే కంపెనీలకే మద్యం ఆర్డర్లు లభించేలా చేయడం, వారినుంచి ‘జే’ ట్యాక్స్‌ వసూలు లాంటి బాధ్యతలన్నీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే నిర్వహించారనే ఫిర్యాదులున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొన్నాళ్లు ఐటీ సలహాదారుగా పని చేసిన ఈయన జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలనేది ఈయన ఆదేశాల మేరకే జరిగేవన్న విమర్శలున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఈ దందా నడిపించినట్లు సమాచారం. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, బ్రూవరీస్, ఇథనాల్‌ ప్లాంట్ల నుంచి ‘జే ట్యాక్స్‌’ వసూలు చేసేవారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీల బ్రాండ్లు, జే బ్రాండ్లకే ఆర్డర్లు లభించేలా చేయడంలో సత్యప్రసాద్‌దే ప్రధానపాత్ర అనే ఫిర్యాదులున్నాయి. కసిరెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తూ, వాటిని అమలు చేసేవారని APSBCL స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన చెప్పిన బ్రాండ్లే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేలా డిపో మేనేజర్లకు రోజూ ఆదేశాలిచ్చేవారన్న ఫిర్యాదులున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో ఈఎస్‌గా ఉన్న శౌరి సత్యప్రసాద్‌కు సహాయకుడిగా ఉంటూ మద్యం కొనుగోలు ఆర్డర్లు సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషించారనే ఫిర్యాదులు నమోదయ్యాయి. ఏసీఎస్‌బీసీఎల్‌లో జీఎంగా పదవీవిరమణ చేసి, తర్వాత వాసుదేవరెడ్డి వద్ద ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్‌ది ఈ దందాలో ప్రధానపాత్రని టీడీపీ గుర్తించింది.

లోకల్​ మేడ్​, గోవా సీల్​ కల్తీ మద్యం- 'ఓటేసి చావు' అన్నట్లు వైఎస్సార్సీపీ కృూరత్వం - GOA LIQUOR

సచివాలయంలో కీలకంగా ఉన్న ఓ సీనియర్‌ ఉన్నతాధికారి ఈ అక్రమాల్ని అడ్డుకోకుండా పరోక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. అందుకు ప్రతిగా ఆయన తరఫున బినామీగా, కలెక్షన్‌ ఏజెంట్లుగా ఉండే ఓ వ్యక్తికి భారీగా సొమ్ములు అందాయని చెబుతున్నారు. చిన్న చిల్లర దుకాణం వద్ద చూసినా డిజిటల్‌ లావాదేవీలు ఉంటాయి. కానీ జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో 1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని నగదు రూపంలోనే అమ్మింది. గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందన్న ఫిర్యాదులున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా మొదలుకుని విక్రయాల వరకూ అన్నింటా వ్యవస్థీకృతంగా సాగించిన ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న నేతలు, పాత్రధారులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ కీలక నాయకుల బినామీలు, సన్నిహితులుగా పేరొందిన వారి నివాసాలు, కార్యాలయాల్లో, అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల్లో ఎక్కడ సోదాలు చేసినా ఈ కుంభకోణం డొంక బయటపడుతుంది. వారిలో ఏ ఒక్కరిని విచారించినా గుట్టంతా వీడుతుంది. దిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు, APSBCL నుంచి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మధ్య విడదీయలేని అనుబంధముంది. ఈ కోణంలోనూ సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అడ్డగోలుగా జే బ్రాండ్ల మద్యం విక్రయాలు - పోతున్న ప్రాణాలు - YSRCP Supplying Deadly J Brand

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.