ETV Bharat / state

అది తప్పుడు ప్రచారం - ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ఏపీ సీఈవో - AP CEO MK MEENA ON Electoral Ink - AP CEO MK MEENA ON ELECTORAL INK

AP CEO MK MEENA ON Electoral Ink : ఏపీలో చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముకేశ్‌ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఆయన స్పష్టం చేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముకేశ్‌ కుమార్ మీనా హెచ్చరించారు.

AP CEO MK MEENA ON Electoral Ink
AP CEO MK MEENA ON Electoral Ink (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 1:28 PM IST

AP CEO MK MEENA ON Polling Arrangements 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్ మీనా హెచ్చరించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు వేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.

AP Elections 2024 : ఈ తరహా ప్రచారం సరికాదని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సిరా సీఈసీ వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమే అని తేల్చిచెప్పారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు.

లోక్​సభ సమరానికి తెలంగాణ సై - పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా అధికార యంత్రాంగం - lok sabha polling in telangana

ఎగ్జీట్ పోల్స్​పైనా నిషేధం : అదే విధంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్​క్యాస్టింగ్ చేస్తున్నామని ముకేశ్‌ కుమార్ మీనా అన్నారు. ఒపీనియన్ పోల్, ఎగ్జీట్ పోల్స్​పైనా నిషేధం ఉందని తెలిపారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశామన్నారు. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తుని వివరించారు. ఎన్నికల రోజు హింస జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

హింసాత్మక ఘటనలపై కఠినంగా వ్యవరిస్తాం : ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తామని ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోందని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదన్నారు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని అన్నారు. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదయిందని వెల్లడించారు. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ముకేశ్‌ కుమార్‌ మీనా వివరించారు.

మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు. 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల 4 గంటలకు, మరో మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని అన్నారు. 13న సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందని వెల్లడించారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్​ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు ఉండకూడదని ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్​లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదని ముకేశ్‌ కుమార్ మీనా పేర్కొన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదని అన్నారు. అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అననుమతించమని చెప్పారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్‌మెన్​లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్​ - మిగతా నియోజకవర్గాల్లో 6వరకు - TS LOK SABHA ELECTIONS POLLING 2024

రాష్ట్రంలో అమల్లోకి 144 సెక్షన్, నిర్భయంగా ఓటెయ్యాలని వికాస్​ రాజ్ విజ్ఞప్తి​ - CEO Vikas Raj on Exit polls 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.