ETV Bharat / state

"దీపావళి ధమాకా" ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు - కేబినెట్‌ ఆమోదం - AP CABINET MEETING KEY DECISIONS

సచివాలయంలో 3 గంటలుపాటు సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి ఆమోదం

AP Cabinet Meeting key Decisions
AP Cabinet Meeting key Decisions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 3:06 PM IST

Updated : Oct 23, 2024, 3:18 PM IST

AP Cabinet Meeting key Decisions : రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 3 గంటలు పాటు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి అకౌంట్​లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒక్కో ఉచిత సిలిండర్​కు 900 కోట్లు చొప్పున 3 సిలిండర్లకు 2,684 కోట్లు భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్​లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్​లు ఇచ్చాం : రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నా మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఏడాదికి 2,684 కోట్ల ఖర్చుతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నేడు నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి పండుగ నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్​లు ఇచ్చామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి కానుకగా అందిస్తుందన్నారు.

"మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అక్టోబర్‌ 31న ప్రారంభిస్తాం. అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తాం. గ్యాస్‌ డబ్బులు చెల్లిస్తే 48 గంటల్లో డీబీటీ ద్వారా తిరిగి నగదు జమ అవుతుంది." - మంత్రి నాదెండ్ల మనోహర్

ఉచిత ఇసుకకు మంత్రివర్గం ఆమోదం : ఉచిత ఇసుక విధానంలో సినరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సినరేజ్ చార్జీల వల్లే ప్రభుత్వంపై 264 కోట్లు భారం పడనుంది. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు ఆ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో వ్యాఖ్యానించారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు.

"గతంలో ఇసుక ఆదాయాన్ని సొంతానికి వాడుకున్నారు. కంపెనీలు పెట్టి ప్రతి నెలా తాడేపల్లి ప్యాలెస్‌కు ఇసుక డబ్బు చేర్చారు. ఇసుకపై సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీలు ప్రభుత్వం రద్దు చేసింది. సొంత అవసరాలకు ఇసుకను పూర్తి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని రవాణా ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లవచ్చు. ఐదు జిల్లాల్లో ఇసుక కొంత అందుబాటులో లేదు." - మంత్రి కొల్లు రవీంద్ర

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం దీపావళి నుంచి ప్రారంభిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్‌

శారదా పీఠానికి భూ కేటాయింపు రద్దు : దేవాలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. విశాఖకు చెందిన శారదా పీఠం భూ కేటాయింపులు రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లోనూ భారీ అక్రమాలు జరిగాయని చర్చ, చర్యలకు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర ప్రజలకు గుడ్​న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP

ఏపీ పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0 - క్యాబినెట్​ ఆమోదముద్ర - 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం

Last Updated : Oct 23, 2024, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.