ETV Bharat / state

ఉపఎన్నికల్లో అక్రమాల ఫలితం- ఓ ఐఏఎస్​ అధికారి సస్పెండ్​ మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం - కలెక్టర్ గిరీషా

Annamayya District Collector Suspended: తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల్లోని అక్రమాల ఫలితం బయటపడుతోంది. అధికార పార్టీకి ఏకపక్షంగా సహాకరింంచిన ఐఏఎస్​ను సస్పెండ్​ చేస్తూ సీఎస్​ జవహర్​ ఉత్తర్వులు జారీ చేశారు. తహశీల్దార్​, డీటీని కూడా సస్పెండ్​ చేస్తూ నోటీసులు వెలువడ్డాయి. మరో ఇద్దరు అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

annamayya_district_collector_suspended
annamayya_district_collector_suspended
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 7:24 AM IST

Annamayya District Collector Suspended: తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల సమయంలో నకిలీ ఓటర్లు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 34 వేల ఫోటో గుర్తింపు కార్డులను ఈఆర్వోగా ఉన్న గిరీషా లాగిన్ నుంచే డౌన్ లోడ్ చేసినట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఓ తహసిల్దార్ సహా, డిప్యూటీ తహసిల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో ఓ ఐపీఎస్ సహా, మరో ఐఎఎస్ అధికారి పాత్రపైనా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల జారీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీఐ ఆదేశాల మేరకు ఈ నెల 18 తేదీనే ఐఎఎస్ అధికారి గిరీషాపై సస్పెన్షన్ వేటు వేసినా ఆ ఉత్తర్వులను వెలుగులోకి రానీయకుండా ప్రభుత్వం గోప్యంగా వ్యవహరించింది.

జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ నో- కమిటీని రద్దు చేయాలని ఖర్గే లేఖ

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల సమయంలో స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేసిన గిరీషా, అధికారిక ఎన్నికల లాగిన్ నుంచి 34 వేలకు పైగా ఎపిక్ కార్డులు అక్రమంగా డౌన్ లోడ్ చేసి దుర్వినియోగం చేశారన్న ఆరోపణల మేరకు ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి అర్బన్ మండలంలోని కొందరు ఓటర్లకు సంబంధించిన ఎపిక్ కార్డులను ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈఆర్వోనెట్ నుంచి డౌన్ లోడ్ అయినట్టుగా గుర్తించారు.

ఏపీలో రాజ్యాంగ నిర్మాతకు తీరని అవమానం! జగన్​కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఉందా?

2021 మార్చి ,ఏప్రిల్ నెలల్లో ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు డౌన్ లోడ్ చేసినట్టుగా తేలింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్న ఐఎఎస్ అధికారి గిరిషాను అఖిలభారత సర్వీసు రూల్స్ క్రమశిక్షణ, అప్పీల్ నిబంధన మేరకు తక్షణం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. దీంతో పాటు ఈ వ్యవహారంపై విచారణ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు సస్పెన్షన్ సమయంలో ఆయన విజయవాడ విడిచి వెళ్లకూడదని పేర్కోన్నారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి , కేంద్ర సిబ్బంది వ్యవహారల శాఖకు పంపారు.

మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి అప్పటి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఏఈఆర్వోగా పనిచేసిన తహసిల్దార్ ఎం.జయరాములు, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ విజయభాస్కర్ సహా మరో ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లపైనా సస్పెన్షన్ వేటు వేశారు. వీరంతా ఈఆర్వో అయిన గిరీషా లాగిన్ నుంచి 34 వేల ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులను డౌన్ లోడ్ చేసినట్టు తేలింది. వీరందరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై ఓ ఐపీఎస్ అధికారి, మరో ఐఎఎస్ అధికారి పాత్రపైనా విచారణ జరుగుతోంది. త్వరలోనే ఈసీ వీరిరువరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఫైనాన్స్​లో కారు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే - ఆర్థికంగా చాలా నష్టం!

ఉపఎన్నికల్లో అక్రమాల ఫలితం- ఓ ఐఏఎస్​ అధికారి సస్పెండ్​ మరో ఇద్దరిపై అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.