ETV Bharat / state

'గ్రూప్​-2 ప్రధాన పరీక్ష వాయిదా తప్పదా?' - అభ్యర్థుల విజ్ఞప్తికి ఏపీపీఎస్సీ స్పందన చూడండి

ఏపీపీఎస్సీ గ్రూప్-2​ మెయిన్స్​ను వాయిదా వేయాలని అభ్యర్థుల వినతి - మరో 30 రోజులు గడువు పెంచాలని కోరుతూ విజ్ఞప్తి

Group 2 candidates Appeal To APPSC
Group 2 candidates Appeal To APPSC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 7:35 PM IST

Group 2 candidates Appeal To APPSC : వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ను కోరుతున్నారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా ఏపీపీఎస్సీ సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సైతం కోరారు. గ్రూప్-2 ప్రధాన పరీక్ష గడువు పెంపుపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేదీల ప్రకటనల ఆధారంగా గ్రూప్-2 మెయిన్స్​ పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.

APPSC Groups Mains Exam Issue : సర్కారు కొలువు సాధించాలన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవిత లక్ష్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికారపీఠమెక్కిన వైఎస్​ జగన్ కీలకమైన గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడం వల్ల గతేడాది డిసెంబర్ 7న హడావుడిగా 897 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది.

సిలబస్‌లో మార్పులు చేసి గ్రూప్స్​ అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్‌-2కు 4లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరయ్యారు. వారిలో 92వేల 250మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.

మరోసారి వాయిదా వేయాలని కోరుతున్నాం : "ఈ ఏడాది జూలై 28న మెయిన్స్​( ప్రధాన) పరీక్షలు జరగాల్సి ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తితో కూటమి సర్కారు వాయిదా వేసింది. గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఛైర్‌ పర్సన్‌గా ఇటీవల రిటైర్డ్ ఐపీఎస్​ అధికారిణి ఎ.ఆర్.అనురాధ బాధ్యతలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీకి కార్యాచరణ రూపొందించి వచ్చే ఏడాది జనవరి 5న గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహించాలని ఈ మేరకు నిర్ణయించారు. సన్నద్ధతకు 60 రోజుల వ్యవధి మాత్రమే ఉండటం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని గ్రూప్​-2 మెయిన్స్​ అభ్యర్థులు తెలిపారు.

గ్రూప్​-2 వాయిదా వేసే ఛాన్స్​ : గ్రూప్స్​ అభ్యర్థుల వినతి మేరకు గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధులు సైతం పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఛైర్​పర్సన్ అనురాధను కలసి వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలిచ్చారు. మరో 30 రోజులు గడువు పెంచి ఫిబ్రవరిలో మెయిన్స్​ పరీక్షను నిర్వహించాలని కోరారు.

నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వస్తున్నందున పరీక్ష తేదీ మార్చే అంశంపై ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ సానుకూల ధోరణితో సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలిసింది. నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలన్న సర్కారు ఆదేశాల మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను మరోసారి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.