ETV Bharat / state

భోగాపురం ఎయిర్‌పోర్టుకూ రెక్కలు - ‘ఉక్కు’భవిష్యత్తు మారనుందా? ఏపీ ప్రజల కొత్త ఆశలు - AP Hopes on Bhogapuram Airport - AP HOPES ON BHOGAPURAM AIRPORT

Andhra Pradesh People Hopes on Bhogapuram Airport : కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కిన శాఖలు ప్రజల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో ముందడుగు పడే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.

kinjarapu_rammohan_naidu_appointed_civil_aviation_minister
kinjarapu_rammohan_naidu_appointed_civil_aviation_minister (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 10:41 AM IST

Kinjarapu Rammohan Naidu From TDP Appointed Civil Aviation Minister : ఏపీ నుంచి కేంద్రమంత్రి అయిన రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయాన శాఖ దక్కగా గతంలో 2014 నుంచి 18వరకు అశోక్‌గజపతిరాజు ఇదే శాఖను నిర్వహించిన విషయాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలోనే దగదుర్తి, భోగాపురం విమానాశ్రయాలకు బీజం పడింది. ఇందులో కర్నూలు పూర్తి అయ్యింది. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల విస్తరణ పనులు జరిగాయి. ఆధునీకరించిన తిరుపతి విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రాజమండ్రి విమానాశ్రయ విస్తరణ, రాత్రి పూట విమానాల ల్యాండింగ్‌ సౌకర్య పనులు పూర్తయ్యాయి. హుద్‌హుద్‌తో దెబ్బతిన్న విశాఖ విమానాశ్రయ పునర్నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి. కడప విమానాశ్రయం నుంచి ఆరీసీఎస్‌ ఉడాన్‌ కింద తక్కువ ధరల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా నియమితులు కావడంతో రాష్ట్రంలో విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల దశ మారుతుందని అంచనా వేస్తున్నారు.

విజయవాడ విమానాశ్రయ సమీకృత టెర్మినల్‌ భవన నిర్మాణం వేగం పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా 611.80 కోట్లతో చేపట్టిన ఈ టెర్మినల్‌ భవన నిర్మాణం 40శాతం మాత్రమే పూర్తయింది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి చొరవ కొరవడటమే ఇందుకు ప్రధాన కారణం. 2024 జూన్‌ కల్లా దీన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పెద్ద పురోగతి కనిపించలేదు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు 225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటం, పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు చేపడుతున్నందున విజయవాడ ఎయిర్‌పోర్టుకు మహర్దశ పట్టే అవకాశాలున్నాయి.

రామ్మోహన్​కు పౌర విమానయానం,పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, వర్మకు భారీ పరిశ్రమల శాఖల కేటాయింపు - AP Ministers Portfolios

నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 7న సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసింది. విమానాశ్రయ అభివృద్ధి పనులను SCL టర్బో కన్సార్షియానికి అప్పగించారు. నెల్లూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ పేరుతో SPV కూడా ఏర్పాటు చేశారు. 2018 జూన్‌లో NIALతో రాయితీ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును పక్కనపెట్టేసింది. విమానాశ్రయానికి కేటాయించిన భూములనూ రద్దు చేసింది. పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు నియమితులైన వేళ ఇప్పుడు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మార్గం ఏర్పడనుంది. పుట్టపర్తిలో ప్రస్తుతం సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొని రాయలసీమ ప్రాంతానికి విమాన సేవలను విస్తరించాలని, అక్కడ పైలెట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం అమలుకూ మార్గం సుగమం కానుంది.

హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన అనుభవంతో చంద్రబాబు విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ- విజయనగరం మధ్య భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదిపారు. అప్పట్లో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉండటంతో 2016 జనవరిలో స్థల అనుమతులు, అక్టోబర్‌లో సూత్రప్రాయ అనుమతులు లభించాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు తొలి దశను ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలకు వీలుగా నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన 2 వేల 203 ఎకరాల భూమిని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు ప్రాథమిక వ్యయం 2 వేల500 కోట్లు. అయితే తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో విపరీతమైన జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం ఎంత పెరిగిందో తెలియదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో సహకరించనున్నందున భోగాపురం విమానాశ్రయం త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది పూర్తయితే విశాఖపట్నానికి అంతర్జాతీయ విమాన రాకపోకలు పెరిగి పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధికి బాటలు పడతాయి.

భోగాపురం విమానాశ్రయ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలి: సీఎస్ జవహర్​రెడ్డి - Bhogapuram Airport Works
విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేప్టివ్‌ బొగ్గు, ఇనుప గనులు కేటాయించాలని కార్మికులు సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగువాడైన కిషన్‌రెడ్డి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా నియమితులవడంతో ఈ డిమాండ్‌ను నెరవేర్చేందుకు వీలు ఏర్పడింది. నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ ఉక్కు శాఖ సహాయమంత్రిగా నియమితులవడం వల్ల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంతోపాటు, విభజన చట్టంలో చెప్పినట్లుగా బయ్యారం, కడపల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్న భావనా వ్యక్తమవుతోంది. సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లశాఖలు అప్పగించడంతో గ్రామీణ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులు ఈయన పరిధిలోకి వస్తాయి. కాబట్టి రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.