ETV Bharat / state

24 మందితో ఏపీ మంత్రుల జాబితా - డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - AP New Cabinet Ministers List - AP NEW CABINET MINISTERS LIST

AP New Cabinet Ministers List : కొత్తవారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ మంత్రుల జాబితా విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది. మంత్రివర్గంలో జనసేనకు మూడు, బీజేపీకి ఒక్క స్థానం కేటాయించారు.

AP New Cabinet Ministers List
AP New Cabinet Ministers List (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 7:19 AM IST

వీడిన ఉత్కంఠ - ఆంధ్రప్రదేశ్​ కొత్త మంత్రులు వీరే! (ETV Bharat)

AP New Cabinet Ministers List : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేస్తారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. ఒక స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది.

మంత్రి వర్గంలో సమతూకం : సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న బండి సంజయ్‌ - Bandi Sanjay Attend AP CM Oath 2024

మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత వంటివారికి ప్రాధాన్యమిచ్చారు.

మంత్రి వర్గంలో కొత్త ఎమ్మెల్యేలు : మొత్తం జాబితాను పరిశీలిస్తే 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వారిలో పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ సహా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి ఎనిమిది మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి గతంలో మంత్రులుగా చేశారు.

సీనియర్ మంత్రులకు నిరాశ : యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనంద్ బాబు, కాలవ శ్రీనివాసులు, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, కొండ్రు మురళి, కూన రవికుమార్‌, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణ, చినరాజప్ప, కొణతాల రామకృష్ణ, కామినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది.

ఈ పాస్​లు చాలా హాట్​ గురూ! చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పరిమితంగానే వీవీఐపీల పాస్​లు - AP New CM Oath Ceremony Passes

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం - AP Chandrababu Naidu oath ceremony

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.