ETV Bharat / state

'గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తాం' - మొదటి ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు - AP Ministers take charge - AP MINISTERS TAKE CHARGE

Andhra Pradesh Ministers Take Charge: మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్‌, హోంమంత్రిగా అనిత, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. మంత్రి హోదాలో మొదటి ఫైళ్లపై సంతకాలు చేశారు. తమపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు.

AP Ministers take charge
AP Ministers take charge (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 8:34 PM IST

Updated : Jun 19, 2024, 8:57 PM IST

Andhra Pradesh Ministers Take Charge: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ మంత్రిగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తొలి ఫైలుపై సంతకం చేశారు. ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్, అనంతరం తన స్థానంలో ఆసీనులై రెండు దస్త్రాలపై సంతంకం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి సంతకం చేశారు.

గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై రెండో సంతకం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన సీనియర్ నేత నాగబాబు, పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు డిప్యూటీ సీఎంను అభినందించారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Charge as Deputy CM
Home Minister Vangalapudi Anitha: వంగలపూడి అనిత హోంమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్-2లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. దిశ పోలీసుస్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టంచేశారు. ప్రజలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని.. పాత ప్రభుత్వ ఆలోచనల్లో ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా పరిగణిస్తామని అనిత తెలిపారు.

Legislative Affairs Minister Payyavula Keshav: అసెంబ్లీలోని ఛాంబర్లో పయ్యావుల కేశవ్ శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు. ప్రజల కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. జగన్ తప్పకుండా సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని చెప్పారు. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా తామేనని అన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు.

Andhra Pradesh Ministers: మరో ఎనిమిది మంది మంత్రులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 7:30కి వాసంశెట్టి సుభాష్, ఉదయం 9 గంటలకు టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:30కి నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10:30కి గొల్లపల్లి దేవదాయ కమిషనర్ కార్యాలయంలో మంత్రిగా ఆనం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.35కి సవిత, 11 గంటలకు కొండపల్లి శ్రీనివాస్, 11.15కి అనగాని సత్యప్రసాద్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కందుల దుర్గేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

'సామాన్య టీచర్‌ను ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు' - హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత - Home Minister Anitha Take Charges

Last Updated : Jun 19, 2024, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.