ETV Bharat / state

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు- తొలిసంతకాలు వాటిపైనే! - AP MINISTERS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 1:01 PM IST

Updated : Jun 20, 2024, 6:36 PM IST

Andhra Pradesh Ministers Take Charge: ఏపీలో మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నేడు ఎనిమిది మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు, దేవదాయ శాఖ మంత్రిగా ఆనం, బీసీ సంక్షేమం, టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా సవిత, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖమంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు చేపట్టారు.

Andhra Pradesh Ministers Take Charge
Andhra Pradesh Ministers Take Charge (ETV Bharat)

Andhra Pradesh Ministers Take Charge: రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బీసీ సంక్షేమం, టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా సవిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటి సంతకం అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన, రెండో సంతకం ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన చేశారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వెనకబడిన అన్ని వర్గాలతో కలిపి 75 శాతం మందికి సేవ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని తెలిపారు.

బీసీలకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు సంక్షేమం ప్రారంభమైందని తెలిపారు. చంద్రబాబు పాలనలో 2,173 మందికి ఎన్టీఆర్ విదేశీ విద్య అందిస్తే జగన్ కేవలం 89 మందికి మాత్రమే విదేశీ విద్య అందించారన్నారు. ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్​లు, బీసీ భవన్​లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

'గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తాం' - మొదటి ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు - AP Ministers take charge

Vasamsetti Subhash: కార్మికశాఖ మంత్రిగా సచివాలయంలో వాసం శెట్టి సుభాష్ బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయంలోని ఐదో బ్లాక్​లో పూజలు నిర్వహించిన మంత్రి తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్సీపీ పాలనలో కార్మిక చట్టాలను తుంగలో తొక్కారని మంత్రి ఆరోపించారు. 22 కేంద్ర, 4 రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ, కార్మిక హక్కుల, చట్టాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. గతంలో కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం బీమాను అందజేసిందన్నారు.

భవన నిర్మాణ కార్మికుల కోసం వచ్చే 1 శాతం సెస్​ను వైఎస్సార్సీపీ పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు వాసంశెట్టి సుభాష్‌ ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల సంక్షేమంకోసం చేసిన 13 పథకాలను గత ప్రభుత్వం లేకుండా చేసిందన్నారు. కార్మికుల అభ్యున్నతి కోసం తాను కూడా ఒక కార్మికుడిగా పని చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో విఫలం అయిందన్నారు. టీడీపీ విజయంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకమని మంత్రి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Charge as Deputy CM

Minister TG Bharath: పరిశ్రమల శాఖ మంత్రిగా సచివాలయం నాలుగో బ్లాక్‌లో టీజీ భరత్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్న మంత్రి, పరిశ్రమ నుంచి వచ్చినవాడిగా తనకు శాఖపై అవగాహన ఉందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో పరిశ్రమ వర్గాలు భయాందోళనలు ఎదుర్కొన్నాయని, మనకు సుదీర్ఘ తీరప్రాంతం, వనరులు ఉన్నాయన్నారు. తాను, లోకేశ్ కలిసి పరిశ్రమల రంగాన్ని పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. కర్నూలునూ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Minister Kondapalli Srinivas: సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి, 20 ఆదర్శ మండలాల ప్రకటనపై తొలి సంతకం చేశారు. ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక బృందాలకు నిధుల లభ్యత ఆధారంగా వడ్డీ లేని రుణాలపై రెండో సంతకం చేశారు.

కొత్త క్యాబినెట్‌ మంత్రులకు ఛాంబర్‌లు కేటాయింపు - Allotting chambers to ministers

Minister Anam Ramanarayana Reddy: విజయవాడలో దేవదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గొల్లపూడి కమిషనరేట్ కార్యాలయంలో మంత్రిగా ఆనం బాధ్యతలు చేపట్టిన ఆనం, రూ.50 వేల కంటే ఆదాయం తక్కువున్న ఆలయాల్లో అర్చకుల పారితోషికం రూ.7 వేలకు పెంపుపై తొలి సంతకం చేశారు. దేవదాయ శాఖ శ్రేయో నిధి కింద నిధులు ఇస్తున్నామని,ఆలయాల పునర్నిర్మాణం, దాతల విరాళాలపై సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని తెలిపారు. అన్యాక్రాంతమైన దేవదాయ భూములను కాపాడుకునేందుకు న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు.

Minister Nimmala Ramanaidu: జలవనరుల శాఖ మంత్రిగా సచివాలయం నాలుగో బ్లాక్‌లో నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించామన్న మంత్రి నిమ్మల, వైఎస్సార్సీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం నిధులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారిమళ్లించిందన్న మంత్రి, తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు.

Minister Anagani Satya Prasad: సచివాలయం నాలుగో బ్లాక్‌లో రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా సచివాలయం రెండో బ్లాక్‌లో పర్యాటకశాఖ మంత్రిగా కందుల దుర్గేష్ (Kandula Durgesh) బాధ్యతలు చేపట్టారు.

ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల్లో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు - సరకు తూకంపై ఆరా - Minister Nadendla Inspection

Last Updated : Jun 20, 2024, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.