ETV Bharat / state

పంచాయతీల అభివృద్ధిని వైఎస్సార్సీపీ గాలికొదిలేసింది- రేపు ఉప్పాడ సముద్రతీరాన్ని సందర్శిస్తా: పవన్ - pawan kalyan press meet

Pawan Kalyan Press Meet: ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించాలనే అంశంపై రేపు క్షేత్రస్థాయి పర్యటన చేస్తానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో పవన్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని పవన్ మండిపడ్డారు.

Pawan Kalyan Press Meet
Pawan Kalyan Press Meet (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 5:26 PM IST

Pawan Kalyan Press Meet: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ కాకినాడ జిల్లా కలెక్టరేట్​లో పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో కూడా పవన్‌ కల్యాణ్‌ సమీక్షించారు. పవన్​తో పాటు ఎంపీ ఉదయ్, చినరాజప్ప, పంతం నానాజీ సమీక్షలో పాల్గొన్నారు.

ఇన్ని సంవత్సరాలు నుంచి పంచాయతీ నిధులు రావడం లేదని తెలిసిందని, ఒక్క ఇసుకలో ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి వెయ్యి కోట్లు పక్కదారి మళ్లించారని, మొత్తంగా 5000 వేల కోట్లు నిధులు దారి మళ్లించారని చెప్పుకొచ్చారు. ఏపీ మినరల్ డెవలపమెంట్ కార్పొరేషన్ నుంచి పంచాయతీలకు వస్తాయిని, అయితే ఆ నిధులను పంచాయతీలకు ఇవ్వలేదని పవన్ కల్యాణ్​ స్పష్టం చేశారు. వీటి మీద 48 గంటల్లో పూర్తి నివేదిక కలెక్టర్ అందిస్తారని చెప్పారని చెప్పారు.

అటవీ శాఖ పరంగా కాకినాడ సమీపంలో హోప్ ఐల్యాండ్, మడ అడవులు కాపాడుకోవాలని, ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నమన్నారు. కాలుష్య నియంత్రణ మీద అధికారులు ఒక నివేదిక అందిస్తామన్నారని, పర్యావరణ సమతుల్యత కాపాడాలని తెలిపారు.
భూతాపం పెరిగిపోతోందని, అందుకే పర్యావరణ పరంగా పరిశ్రమల ఏర్పాటు సమయంలో కొన్ని నిబంధనలు పాటింపు మీద దృష్టి పెట్టామన్నారు. అటవీ శాఖ పరిధిలో లేని మడ అడవులను సైతం అటవీ శాఖ పరిరక్షణ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు పవన్ కల్యాణ్​ చెప్పారు. నీటి పిల్లుల సంరక్షణ, వాటి గణన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఖాళీల భర్తీ జరగాలని పవన్ కల్యాణ్​ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ పుణ్యమా అని నిధులు కొరత ఎక్కువగా ఉందని మండిపడ్డారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతున్న అంశాన్ని బుధవారం పరిశీలిస్తానని,
స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తానని పవన్ తెలిపారు. కోతకు గురవుతున్న ఉప్పాడ తీరాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ఉప్పాడ తీరం ముంపుపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్న పవన్, ఎందుకు కోతకు గురవుతుందో నిపుణులు చెబుతారన్నారు.

రాష్ట్రంలో భారీగా నిధులు మళ్లించేశారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ శాఖలో నిధులు ఏఏ అవసరాలకు వినియోగించారో తెలియకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు లక్ష్యంగా పని చేస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగ కల్పన ఉందని, పర్యాటక శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కేరళలో కొబ్బరి ఉత్పతులతో రోడ్డు వేశారని, అలాంటి విధానాలు ఏపీలో కూడా ఆలోచిస్తున్నామన్నారు.

నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు : పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech in Gollaprolu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.