ETV Bharat / state

రాష్ట్ర అప్పులు తీర్చాల్సింది ప్రజలే - ఒక్కొక్కరిపై ఎంత భారం ఉందో తెలుసా? - cm ys jagan

Andhra Pradesh Debt: ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఊరారా తిరిగి అభ్యర్థించిన సీఎం జగన్‌, ప్రజలు గెలిపించి అధికారం ఇచ్చిన పాపానికి అందరినెత్తినా లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఉన్న తలసరి అప్పు ఎంతో తెలుసా? అక్షరాలా 2 లక్షల 4 వేల 365 రూపాయలు! ఇదంతా పన్నుల రూపంలో తిరిగి చెల్లించాల్సింది ప్రజలే! ఇలాంటి వాస్తవాలను దాచేస్తూ తన పాలనలో గణనీయమైన మార్పు రాష్ట్రంలో వచ్చిందంటూ జగన్‌ గొప్పలుపోతున్నారు. అది మార్పు కాదని, రాష్ట్ర ఆర్థిక రంగానికి వైసీపీ సర్కార్‌ చేసిన గాయమంటూ కాగ్‌ కడిగేస్తున్నా, జరజాగ్రత్త అంటూ కేంద్రమూ హెచ్చరిస్తున్నా జగన్‌ తీరు మారడం లేదు. అప్పులకు మళ్లీ సిద్ధం అంటున్నారు.

Andhra_Pradesh_Debt
Andhra_Pradesh_Debt
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 7:02 AM IST

రాష్ట్ర అప్పులు తీర్చాల్సింది ప్రజలే - ఒక్కొక్కరిపై ఎంత భారం ఉందో తెలుసా?

Andhra Pradesh Debt: జగన్‌ పాలనలో రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం జనవరి ప్రారంభానికే 10లక్షల21 వేల కోట్ల రూపాయలను దాటింది. ప్రభుత్వ అప్పుతో మనకేంటి పని? సర్కారే తీర్చుకుంటుంది కదా అనుకుంటే పొరపాటే. నిజానికి ఆ అప్పులన్నీ తీర్చేది ప్రజలే. ప్రభుత్వం తనకొచ్చే రాబడి నుంచే ఈ రుణాలను తీరుస్తుంది. ఆదాయంలోనూ 70శాతం ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వ అప్పులు పెరిగే కొద్దీ పౌరులపై పన్నుల భారం అదేస్థాయిలో పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే జగన్‌ సర్కారు జనం జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేసుకుంది. వారిపై ఇతర రాష్ట్రాల్లో కనిపించని ఎన్నో భారాలు మోపి, బాదుడే బాదుడు కొనసాగించింది.

ప్రజలపై మోపిన భారం లక్షా 8 వేల కోట్లు: వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారం లక్షా 8 వేల కోట్ల రూపాయలు. ప్రజల నుంచి ఏ స్థాయిలో పిండుకుందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి . దీంతో ఏపీలో అమలవుతున్న పన్నులకు, పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు మధ్య చాలా తేడా ఉంటోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు ధరల భారం ఎక్కువ.

ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర 111 రూపాయల 87 పైసలుగాఉండగా, కర్ణాటకలో 101 రూపాయల 94 పైసలుగా, తమిళనాడులో 102 రూపాయల 70 పైసలుగా, ఒడిశాలో 103 రూపాయల 19 పైసలుగా, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలుగా ఉంది. ఏపీలో లీటరు డీజిల్‌ ధర 99 రూపాయల 61 పైసలు ఉండగా కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు, తమిళనాడులో 94 రూపాయల 24 పైసలు, ఒడిశాలో 94 రూపాయల 76 పైసలు, తెలంగాణలో 97 రూపాయల 82 పైసలుగా ఉంది. ఈ అదనపు భారంతో ఆటో డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు, సామాన్య, మధ్య తరగతి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్

ప్రభుత్వానికి ఆదాయం ఇలా: పన్నుల రాబడి, పన్నేతర రాబడి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు ఈ మూడింటితోనే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నా, అభివృద్ధి పనులు చేయాలన్నా, అప్పులు తీర్చాలన్నా, వడ్డీలు చెల్లించాలన్నా ఈ ఆదాయమే ఆధారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడి అంచనా చూస్తే పన్నుల రాబడి లక్షా 43 వేల 989.37 కోట్ల రూపాయలుగా, పన్నేతర రాబడి 15 వేల 400 కోట్లుగా ఉంది.

కేంద్ర గ్రాంట్లు 46 వేల 834.64 కోట్ల రూపాయలు కాగా, మొత్తం 2 లక్షల 6 వేల 224.01 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం సమకూరాలంటే 70 రూపాయలను పన్నుల రూపంలో ప్రజల జేబుల్లో నుంచి తీసుకుంటుంది. ముఖ్యంగా జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇతర సుంకాలను ప్రజలపైనే వేస్తుంది. పెద్దఎత్తున అప్పులు చేస్తూ వాటిని తీర్చ లేక జగన్‌ సర్కారు జనంపై ఇప్పటికే ఎన్నో భారాలు మోపింది.

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అగ్రస్థానం - అభివృద్ధిలో అధఃపాతాళాం: ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం

జగన్‌ సీఎం కుర్చీ ఎక్కాక భూముల రిజిస్ట్రేషన్ల విలువలను నాలుగుసార్లు సవరించారు. మనం ఎక్కడైనా ఆస్తి కొనాలన్నా, దానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకున్నా చెల్లించాల్సిన ఫీజులను భారీగా పెంచేశారు. ఆఖరికి ఇది ఏ స్థాయికి చేరిందంటే కొన్ని ప్రాంతాల్లోని భూమికి మార్కెట్‌లో ఉన్న విలువను కూడా మించిపోయి రిజిస్ట్రేషన్‌ ధరలను నిర్ణయించారు. అలాగే స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. మద్యంపై పన్నులు పెంచుతోంది. మద్యం విక్రయాలు పెంచాలని అధికారులకు లక్ష్యం విధిస్తోంది. ఫలితంగా శ్రమజీవుల స్వేదఫలం మద్యం రూపంలో సర్కారుకు చేరుతోంది.

2019-20లో ఎక్సైజ్‌ పన్ను రూపంలో రాష్ట్రానికి 6 వేల 914.75 కోట్ల రూపాయలు వస్తే వరుసగా ఆ తర్వాతి సంవత్సరాల్లో 11 వేల 575.07 కోట్ల రూపాయలు, 14 వేల 702.86 కోట్ల రూపాయలు, 16 వేల 167.36 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 18 వేల కోట్ల వరకు వసూలు చేసుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. కొత్త వాహనాలపై జీవితకాలపు పన్ను పెరిగిపోయింది. హరిత పన్నునూ విధిస్తోంది. ఈ రెండింటి రూపంలోనే ఏటా ప్రజల నుంచి 409 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను మూడుసార్లు పెంచేసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలపై చెత్తపన్ను వేసింది.

వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌- కాగ్‌ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో 3 లక్షల 47 వేల 944.64 కోట్ల రూపాయల అప్పును తీర్చాలి. అంటే అసలు, వడ్డీని తీర్చేందుకు ఏడాదికి సుమారు 40 వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమర్పించిన లెక్కల ఆధారంగా కాగ్‌ ఈ లెక్కలను తేల్చింది. వివిధ కార్పొరేషన్ల అప్పులు, ఇతర పెండింగు చెల్లింపుల భారాలు కలిపితే రాబోయే ఐదేళ్లలో ఏడాదికి 93 వేల కోట్ల నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయలకు ఈ చెల్లింపుల భారం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

అధికారిక గణాంకాల ప్రకారమే 2020-21 నుంచి 2023-24 మధ్య అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం ఏకంగా 37శాతం పెరిగిపోయింది. అదే సమయంలో ఏటా జగన్‌ సర్కారు రుణాల భారం పెంచుకుంటూ వచ్చింది. అప్పుల ద్వారా సమకూరిన నిధులను ఆస్తుల సృష్టికి, ఆదాయం పెంపునకు వెచ్చించకుండా రెవెన్యూ వ్యయానికి మళ్లించింది. ఫలితంగా రాష్ట్ర రాబడి పెరగలేదు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చాలంటే ప్రభుత్వం సహజంగానే పన్నుల భారం ప్రజలపై మోపే ప్రమాదమే ఎక్కువ. చివరికి ఆ అప్పుల భారం ప్రజలపైనే పడుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.