ETV Bharat / state

నేడు అసెంబ్లీ ముందుకు రెండు బిల్లులు - గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం - AP Assembly Sessions - AP ASSEMBLY SESSIONS

AP Assembly Sessions Second Day Agenda: ప్రభుత్వం నేడు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ చర్చించనున్నారు.

AP Assembly Sessions Second Day Agenda
AP Assembly Sessions Second Day Agenda (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 8:52 AM IST

AP Assembly Sessions Second Day Agenda: ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇప్పటికే నిర్ణయం తీసుకోంది. నేడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అలాగే వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును తిరిగి పునరుద్ధరించే బిల్లునూ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానాన్ని కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ్యులు ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానానికి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. పాఠశాలల్లో నాడు - నేడు, కొత్త పాలిటెక్నిక్-ఐటీఐలు, వలంటీర్ల వ్యవస్థ, వీఆర్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్ల సమస్యలు, 2022-గ్రూప్-1 పోస్టుల ఇంటర్వూలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నార. విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడ్రనైజేషన్‌పై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.

Council Agenda: శాసన మండలి సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు చర్చను ప్రారంభించనున్నారు. పంచుమర్తి అనూరాధ తీర్మానాన్ని బలపరచనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు, వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హర్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు.

అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి స్పందన ఇదే - BAC Meeting on Assembly Management

AP Assembly Session First Day: తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. తొలుత గవర్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడారు. అయితే గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

2014లో జరిగిన విభజన రాష్ట్రానికి అత్యంత నష్టం చేకూర్చిందని గవర్నర్. ప్రజలకు తీరని గాయాన్ని మిగిల్చిందని, విభజన కారణంగా రాష్ట్రానికి అభివృద్ధి దూరం అయిందని చెప్పారు. ఈ సమయంలో 2014 నుంచి 19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలతో 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధికి దారీతీశాయని గవర్నర్ తెలిపారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 మధ్య వైసీపీ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ నేటికి వాయిదా పడింది. నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంతో పాటు రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

గత ఐదేళ్ల అసమర్ధ పాలనతో ఏపీ పెద్ద పరాజయాన్ని చవిచూసింది: గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ - AP Assembly Sessions 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.