ETV Bharat / state

చిట్టిబుర్రల సూపర్​ ఆవిష్కరణలు - పవన విద్యుత్తుతో వీధి దీపాలు

టాటా విండ్​ కంపెనీ మెచ్చేలా పదో తరగతి విద్యార్థుల ప్రతిభ

anantapur_district_amidyala_zphs_10th_class_students_innovations_to_delh
anantapur_district_amidyala_zphs_10th_class_students_innovations_to_delh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Anantapur District Amidyala ZPHS 10th Class Students Innovations to Delhi : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారు తయారు చేసిన పరికరం అబ్బురపరిచేదిగా ఉంది. ఇంతకీ ఆ పిల్లల ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోతిర్మయి (10వ తరగతి), తనూశ్రీ (9వ తరగతి) సంప్రదాయేతర ఇంధనాలైనా సౌర పవన విద్యుత్తు నుంచి వీధి దీపాలు వెలిగించడం అనే అంశంపై ప్రయోగాన్ని విజయవంతంగా నిరూపించారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులు సారథ్యంలో నమూనాను రూపొందించారు. ప్రధానంగా హైబ్రిడ్ విధానం ప్రకారం సౌర పవన విద్యుత్తు ఉత్పత్తిని వినియోగించి వీధి దీపాలను ఏర్పాటు చేయడం వల్ల అవి చీకటి పడగానే వెలుగుతాయి. మళ్లీ ఉదయం వాటంతకు అవే ఆరిపోతాయి.

విద్యార్థులు సౌర పవన విద్యుత్ ఉత్పత్తి (గాలిమర) ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను బ్యాటరీలో నిల్వ ఉండేలా పరికరాన్ని తయారు చేశారు. దానిద్వారా సులభంగా వీధి దీపాలను వెలిగించి విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. టాటా విండ్ పవర్, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో దిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించే పునరుత్పాదక శక్తి వైజ్ఞానిక ప్రదర్శనలకు ఈ ప్రయోగం ఎంపికైనట్లు ఉపాధ్యాయుడు బండి శ్రీనివాసులు పేర్కొన్నారు.

సర్కారీ బడి విద్యార్థుల ఫ్లైట్ జర్నీ- సొంత ఖర్చులతో టూర్​కు​ తీసుకెళ్లిన టీచర్

'ఏటా టాటా విండ్​ పవర్​ ఆధ్వర్యంలో ఉర్జా మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మా పాఠశాల తరఫున రెండు ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. ఎంతో సంతోషంగా ఉంది.' - బండి శ్రీనివాసులు (ఉపాద్యాయుడు)

ఇదే పాఠశాలకు చెందిన అరవింద్ స్వామి (9వ తరగతి) స్వప్న (10వ తరగతి) రైతుల ప్రయోజనార్థం సోలార్ అగ్రికల్చర్ స్పెయిన్ రోబోట్ ను సృష్టించారు. సౌర పలక ఆధారంగా తయారు చేసిన పరికరంపై మందు పిచికారీ స్పేయర్​ను ఉంచి దానిని మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆధారంగా ఆపరేట్ చేస్తూ పంటలకు మందులను పిచికారీ చేయవచ్చన్నది ప్రయోగపూర్వంగా నిరూపించారు.

ఆవిష్కరణలు అదుర్స్ - వినూత్న పరికరాలతో ఇంజినీరింగ్ ఎక్స్​పో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.