ETV Bharat / state

అన్నయ్య, అబ్బాయి, అల్లుడు - పవన్​కు మద్దతుగా మెగా కుటుంబం - Allu Arjun Sends Wishes To Pawan - ALLU ARJUN SENDS WISHES TO PAWAN

Allu Arjun Sends Wishes To Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో నాని తదితరులు మద్దతు ప్రకటించగా, తాజా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు.

Allu Arjun Sends Wishes To Pawan Kalyan
Allu Arjun Sends Wishes To Pawan Kalyan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 9:20 PM IST

Allu Arjun Sends Wishes To Pawan Kalyan: రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న పవన్ కల్యాణ్​కు, ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. అందులో భాగంగా, పిఠాపురంలో జనసేన జెండా ఎగరవేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సినిమా రంగానికి చెందిన పలువురు హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు రంగంలోకి దిగారు. పవన్ తరపున ఇంటింటి ప్రచారం చేస్తూ, పవన్ కల్యాణ్​ను గెలిపిస్తే నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉంటుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు హీరోలు, ఆయన కుటుంబ సభ్యులు సైతం ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాణ్ కు తమ మద్దతును తెలుపుతున్నారు.

అల్లు అర్జున్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశించిన విజయాన్ని అందుకుంటారని స్టైలిస్​ స్టార్ అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుడిగా తన ప్రేమ, మద్దతును పవన్​ కళ్యాణ్​కు ఎల్లప్పుడు ఉంటుందని పేర్కొంటూ ఎక్స్​లో పోస్టు చేశారు. రాజకీయ పోరాటంలో పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారని, పవన్​కళ్యాణ్ ఎంచుకున్న మార్గాన్ని చూసి గర్వపడుతున్నట్లు అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఆశించిన విజయాన్ని అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గాన్ని చూసి గర్వపడుతున్నానని అన్నారు. కుటుంబ సభ్యునిగా నా ప్రేమ, మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని, మీరు ఆశించిన విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల దూకుడు - ఎప్పుడు కలిసినా విజయ కేతనమే - TDP Janasena Bjp Friendship in AP

రామ్ చరణ్: మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ మేరకు చిరంజీవి విడుదల చేసిన వీడియోను రామ్ చరణ్ ట్యాగ్ చేశారు. ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

చిరంజీవి: ప్రజాసేవ చేయాలన్న పవన్ లక్ష్యం ఉన్నతమైనదని, మీలో ఒకడిగా ఉంటూ, మీకోసం పోరాడే జనసైనికుడిని పిఠాపురం ప్రజలు గెలిపించాలని కోరారు. చట్టసభల్లో పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, చిన్నతనం నుంచే పవన్​లో ఆదర్శభావాలు, ప్రజాసేవ చేయాలన్న ఆశయం బలంగా ఉండేదని తెలిపారు. పవన్ కల్యాణ్​ మీకు సేవకుడిగా, సైనికుడిగా, ఒక అన్నయ్యగా నిలబడతాడని, చిరంజీవి పిలుపునిచ్చారు.

హీరో నాని: పవన్ పెద్ద రాజకీయ యుద్ధం చేస్తున్నారని, సినీ కుటుంబ సభ్యుడిగా ఆయన విజయం ఆశిస్తున్నట్లు హీరో నాని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్​ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానన్న నాని, ఆయనకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయని తెలిపారు. తన మద్దతు పవన్ కల్యాణ్​కి అని, ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.

పవన్​ లాంటి నాయకుడు ఇప్పుడు జనానికి అవసరం : చిరంజీవి- ఆల్​ది బెస్ట్ చెప్పిన నాని - chiranjeevi support to pawan kalyan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.