ETV Bharat / state

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ - చంచల్​గూడ జైలుకు తరలించిన పోలీసులు - ALLU ARJUN ARREST UPDATES

సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్​ అరెస్ట్​, రిమాండ్​

Allu Arjun Remand
Allu Arjun Remand (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

Updated : 17 hours ago

Allu Arjun Remand : పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్​లోని సంధ్య థియేటర్​ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జెలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద సౌత్‌ఈస్ట్ జోన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంతకుముందు అల్లు అర్జున్​కు గాంధీ ఆసుపత్రిలో కొవిడ్​తో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్​ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, రోగుల సహాయకులు వైద్య విద్యార్థులు ఎగబడ్డారు. సెల్​ఫోన్​లతో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆయనను కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం అల్లు అర్జున్​ను నాంపల్లి కోర్టుకు తరలించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.

మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ నెల 27 వరకు మధ్యంతర బెయిల్​ ఇచ్చింది.

తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్​ - BAIL TO ALLU ARJUN

Last Updated : 17 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.