ETV Bharat / state

'పుష్ప-2' బెనిఫిట్‌ షోకి వెళ్తే ప్రాణం పోయింది - అల్లు అర్జున్​ టీమ్​పై కేసు నమోదు - STAMPEDE AT SANDHYA THEATER

సంధ్య థియేటర్‌ వద్ద రాత్రి తొక్కిసలాట, మహిళ మృతి - కుమారుడి పరిస్థితి విషమం - అల్లు అర్జున్​ టీమ్​పై కేసు నమోదు

Police Case on Allu Arjun Team
Police Case on Allu Arjun Team (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2024, 10:59 PM IST

Updated : Dec 5, 2024, 7:05 PM IST

Woman Dies in Stampede at Sandhya Theater : పుష్ప-2 బెనిఫిట్​ షో (Pushpa-2 Benefit Show)ను చూసేందుకు వచ్చిన అభిమానులతో తెలంగాణలో హైదరాబా ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని సంధ్య థియేటర్​ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. మృతురాలి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

Pushpa-2 Premiere Show at Sandhya Theater : పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం ద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీవఛార్జి చేశారు. దీంతో రేవతి(35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు.

కేసు నమోదు : వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకువెళ్లి సీపీఆర్‌ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. పుష్ప-2 (Pushpa-2) సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాతపడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ (Allu Arjun) టీమ్‌పై కేసు నమోదు చేశారు.

సమాచారమివ్వలేదు: సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప (Pushpa 2) సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం మాకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపు చేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు.

రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్‌ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ తెలిపారు.

ఫ్యాన్స్​కు వైల్డ్​ ఫైర్ ట్రీట్ - అల్లు అర్జున్‌ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Last Updated : Dec 5, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.